/rtv/media/media_files/2025/02/27/nX3ovCH1nqy4hMaOq3rQ.jpg)
Telangana government postponed new ration cards issuing
New Ration Cards: తెలంగాణ(Telangana) ప్రజలకు షాకింగ్ న్యూస్. మార్చి 1నుంచి పంపిణీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల్లో కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
మార్చి 8 వరకు ఎన్నికల కోడ్..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త కార్డుల ప్రక్రియ నిలిపివేశారు. అయితే మార్చి 8న ఎన్నికల కోడ్ ముగియనుండగా అనంతరం కొత్త దరఖాస్తులు, లబ్దిదారులకు కార్డుల ప్రక్రియ ముందుకు సాగనుంది. మరోవైపు కొత్త కార్డుల జారీకి సంబంధించి తమకు ఆదేశాలు రాలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ వార్డు సభలు నిర్వహించినప్పుడే కార్డుల జారీ జరుగుతుందని, అంతకు మించి తాము ఏమీ చెప్పలేమంటున్నారు.
Also Read: Dwaraka : కల వచ్చిందని శివలింగం దొంగతనం..వీడిన ద్వారకా మిస్టరీ
ఇక రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్‌కార్డులుండగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. అయితే పంపిణీలో ముందుగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 1.12 లక్షల కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 24 వేలు, వికారాబాద్ లో 22, నాగర్‌కర్నూల్‌లో 15, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 13, నారాయణపేట జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తిలో 6 వేలు అందించనున్నట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల కొత్త కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.
Also Read: USA: జెలెన్ స్కీ పై విరుచుకుపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం