/rtv/media/media_files/2025/03/07/rQfqIb0MIHPRwZilQb8n.webp)
Telangana government launches Rajiv Yuva Vikasam scheme
TG News: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా ఉపాధి రుణాలు అందిస్తుంది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు అందించనుండగా ఇంతకీ ప్రభుత్వం ఈ నగదును ఎందుకిస్తుంది? ఎలా ఇస్తుంది? ఏం చేస్తే మూడు లక్షలు వస్తాయి? అనేది తెలుసుకుందాం.
5 లక్షల మందికి రూ.6 వేల కోట్లు
రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్.. మార్చి 17 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు రూ.3 లక్షల రూపాయల వరకు ఉపాధి రుణాలు అందించనుంది. దాదాపు 5 లక్షల మంది యువతకు రూ. 6 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను మంజూరు చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకుందునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి జూన్ 2 ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనుంది.
20 శాతం లబ్ధిదారుడు భరించాలి..
రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు మూడు కేటగిరీ వారీగా రుణాలను మంజూరు చేయనుంది. కేటగిరీ-1 కింద లక్ష రూపాయల వరకు లోన్లను అందించనుంది. ఇందులో 80 శాతం రాయితీ ఉంటే, మిగతా 20 శాతం లబ్ధిదారుడు భరించాలి. కేటగిరీ 2 కింద లక్ష నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60 శాతం రాయితీతో రూ.3 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Teenmar Mallanna: కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?
అర్హతలు, అప్లికేషన్ విధానం..
ఇక ఈ పథకం కోసం రాష్ట్రప్రభుత్వం కొన్ని అర్హతలను పెట్టింది. రాజీవ్ యువ వికాసం పొందాలంటే తెలంగాణ స్థిర నివాసి అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే దరఖాస్తు సమయంలో లబ్ధిదారులు నిరుద్యోగులుగా మాత్రమే ఉండాలి. ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాలి. అలాగే ఈ పథకాన్ని అప్లై చేసుకునేందుకు ఆధార్ కార్డ్, తెలంగాణ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్లతో పాటు రేషన్ కార్డు కావాలి. దీంతో పాటు లబ్ధిదారులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌ఛేంజ్‌లో నమోదు చేసుకోవాలి. ఇక రాజీవ్ యువ వికాసం అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీతో ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోని ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేసి.. అప్లికేషన్ ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.