/rtv/media/media_files/2025/02/09/EaM787uaElOdeev6dmZ8.jpg)
Telangana government key announcement on Indiramma houses
Indiramma Housing Scheme: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమం వచ్చే వారం ప్రారంభించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటికే అర్హుల ఎంపికపై గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ మొదలైందని చెప్పారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు..
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన అన్నారు. పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని చెప్పారు. ఇక జనవరి 26న మండలానికి ఒక గ్రామం చొప్పున 562 పంచాయతీల్లో పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతలో 72,045 మందికి ఇళ్లను మంజూరు చేయగా ఇప్పుడు కొత్త అర్హుల ఎంపికపై దృష్టి సారించారు. రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను ఏర్పాటు చేయగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. లబద్ధిదారులను 3 జాబితాలుగా L-1(సొంత జాగ ఉన్నవారు), L-2(సొంత స్థలం, ఇల్లు లేని వారు), L-3(ఇతరులు) విభజించారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
ఈ డ్యాక్యుమెంట్లు తప్పనిసరి..
ఈ జాబితాలో 21.93 లక్షల మంది దరఖాస్తుదారులుండగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72 వేల మంది అర్హులను మినహాయించి రీవెరిఫెకేషన్ చేస్తున్నారు. ఇందులోనూ మొదటగా అతి పేదల లిస్ట్ తయారు చేస్తున్నారు. అయితే లబ్దిదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ సర్టిఫికెట్, ప్రజాపాలన దరఖాస్తు, ల్యాండ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున తులం బంగారం పంపిణీ ఆలస్యం అవుతుందని మంత్రి పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం అస్తవ్యస్ధంగా తయారైందని మండిపడ్డారు. తాము ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం సృష్టించింన గందరగోళాన్ని గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నామని చెప్పారు.
BREAKING: HCU వివాదం.. రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court Key Comments on HCU Lands
కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జంతువులు షెల్టర్ అక్కడ తిరగడం షాకింగ్‌గా ఉందని ఉందని తెలిపింది. వారాంతపు సెలవుల్లో 3 రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందకు వచ్చిందని నిలదీసింది. మీరు చెట్లు నరికివేయడం వల్ల అక్కడి జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని ఈ వీడియోలు కూడా మేము చూశామని తెలిపింది.
చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని చెప్పింది. చెట్లు నరికేందుకు పర్మిషన్ తీసుకోకపోతే అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కాపాడాలనుకుంటే నరికివేసిన ఆ 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ఓ ప్రణాళికతో రావాలని ఆదేశించింది. చివరికి మే 15కు విచారణను వాయిదా వేసింది.