Hyderabad Food Safety: హైదరాబాద్‌లో అక్కడ జ్యూస్ తాగితే పైకి పోవాల్సిందే.. షాకింగ్ వీడియోస్!

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పలు జ్యూస్ షాప్‌లపై రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో విస్తుపుయే విషయాలు బయటపెట్టారు. ఫ్రిడ్జ్‌లో పాడైపోయిన పండ్లు గుర్తించారు. పండ్ల పక్కనే ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు.

New Update
Telangana Food Safety Officers conducted inspections in Hyderabad Gachibowli

Telangana Food Safety Officers conducted inspections in Hyderabad Gachibowli

Hyderabad Food Safety: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు హోటల్, రెస్టారెంట్లలో ఫుడ్ మంటగలుస్తుంది. శుభ్రం లేని కిచెన్, పాడైపోయిన కూరగాయలు, కుల్లిపోయిన మాంసాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పోనీ కనీసం వేసవి కాలంలో చల్ల చల్లని జ్యూస్ తాగుదామా? అంటే అది కూడా అలానే తయారైంది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు.. అక్కడ భోజనం కానీ జ్యూస్ కానీ తాగాలంటే గజ గజ వణికిపోతున్నారు. పొరపాటున బయట ఫుడ్ తింటే అనారోగ్యం బారిన పడతామో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. 

Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

గచ్చిబౌలిలో రైడ్స్

ఇందులో భాగంగానే తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసి వారి బాగోతాలు బట్టబయలు చేస్తున్నారు. తాజాగా అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పలు హోటళ్లపై రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో బయటపడ్డ విజువల్స్ చూస్తే ఒక్కొక్కరికి వాంతులు రావడం పక్కా అని చెప్పాలి. గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ గేట్ నంబర్3 వద్ద సిప్ అండ్ స్నాక్‌(𝗦𝗶𝗽 𝗮𝗻𝗱 𝗦𝗻𝗮𝗰𝗸) (జ్యూస్ షాప్)లో అధికారులు రైడ్స్ చేశారు. అందులో.. రిఫ్రిజిరేటర్‌లోని ఆహార పదార్థాలపై ఎలాంటి క్లాత్‌లు కప్పబడలేదని వారు గుర్తించారు.

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

అంతేకాకుండా సపోటాలు, నారింజ వంటి కొన్ని పండ్లు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంకా డస్ట్ బిన్ పై మూతలేకుండా ఉందని.. ఆహార వ్యర్థాలతో నిండి ఉన్నట్లు వారు తెలిపారు. దీనితో పాటు గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ గేట్ నంబర్2 వద్ద బిస్మీ మ్యాగీ అండ్ జ్యూస్ సెంటర్ (𝗕𝗶𝘀𝗺𝗶 𝗠𝗮𝗴𝗴𝗶 𝗮𝗻𝗱 𝗝𝘂𝗶𝗰𝗲 𝗖𝗲𝗻𝘁𝗿𝗲)లో కూడా దాడులు చేశారు. అక్కడ కూడా FSSAI రిజిస్ట్రేషన్ ప్రదర్శించలేదని తెలిపారు. అలాగే రిఫ్రిజిరేటర్‌లోని ఆహార పదార్థాలపై క్లాత్‌లు కప్పబడకుండా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పేస్ట్ కంట్రోల్ రికార్డ్స్, ఎంప్లాయ్ హెల్త్ రికార్డ్స్, వాటర్ ఎనాలసిస్ రిపోర్ట్స్ అందుబాటులో లేవని తెలిపారు. 

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

కొన్ని ఫ్రూట్స్ చెడిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌లో బొద్దింకలు, ఈగలు విపరీతంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా తనిఖీ సమయంలో ఎలుకలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ గేట్ నంబర్2 వద్ద మిలన్ జ్యూస్ సెంటర్ (𝗠𝗶𝗹𝗮𝗻 𝗝𝘂𝗶𝗰𝗲 𝗖𝗲𝗻𝘁𝗿𝗲)లోనూ తనిఖీలు చేశారు. అందులో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. లోపల ఆహార పదార్థాలు నేలపై ఎలా పడితే అలా ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది ఎలాంటి అప్రాన్‌లు, చేతి గ్లౌజ్‌లు లేకుండా ఉన్నట్లు తెలిపారు. 

Also Read: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

అలాగే ఆ జ్యూస్ సెంటర్‌లో విపరీతమైన ఈగలు, దోమలు, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష, మామిడి వంటి చాలా ఫ్రూట్స్ కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఇంకా చట్నీ వంటి ఇంకొన్ని ఆహార పదార్థాలలో బొద్దింకలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇందులో భాగంగానే బనానా క్రష్ , స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సిరప్, ప్యాషన్ ఫ్రూట్ సిరప్ వంటి ఎక్స్‌పరీ డేట్ అయిపోయిన వస్తువులను గుర్తించి వాటిని బయటపడేశారు.

(gachibowli | food safety officers raids | hyderabad | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment