CM Revanth: రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్!

నిర్మాత కేదర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉందని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేదార్, కాళేశ్వరం కేసుల న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి హత్యలపై అనుమనాలు వ్యక్తం చేశారు. ఈ కేసులపై విచారణకు KTR ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఈ రోజు సీఎం చిట్ చాట్ చేశారు.  కేదర్ మరణం వెనుక పెద్ద మిస్టరీ ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసు లో ఉన్న వాళ్ళు వరసగా చనిపోతున్నారన్నారు. కేదర్ హత్యపై ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామన్నారు. కేదార్ మృతదేహం త్వరలోనే ఇండియాకు రానుందన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లోనే ఉన్నారని.. ఆ ఎమ్మెల్యే ఎవరు? అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందన్నారు. కేదర్ కేటీఆర్ (KTR) వ్యాపార భాగస్వామి అని అన్నారు. కేదర్ చనిపోతే కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

Also Read :  పిల్లలు ఈ 5 చెడు అలవాట్లను చాలా వేగంగా నేర్చుకుంటారు

కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీపై నిర్లక్ష్యం..

కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులను కేసీఆర్ (KCR) పక్కన పెట్టారన్నారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉపఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు ఉందన్నారు. రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. అధ్యక్షుడు ఎవరైనా బీజేపీ తోనే తమకు పోటీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపు కోసం పనిచేస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

Also Read :  తమిళంలో మాట్లాడలేకపోతున్నా: అమిత్‌ షా

కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మెట్రో ను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి అని ఆరోపించారు. తాను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తులను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి , బండి సంజయ్ దేనని స్పష్టం చేశారు. అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ల సొంతం చేసుకోవచ్చన్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి సన్మానం కూడా చేస్తానని ఆఫర్ ఇచ్చారు.

హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందన్నారు. సీబీఐ కేసులు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసుల్లో ఈడీ ఇన్వాల్వ్ అయ్యిందన్నారు. మరి ఈడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.రాత్రికి రాత్రి తాము ఎవ్వరినీ అరెస్ట్ చేయమని.. అది తమ విధానం కాదన్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పై కమిషన్ విచారణ జరుగుతుందన్నారు.

Also Read :  ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్‌5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్‌ ఎవరంటే?

ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీని 100% పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ పెరిగిన అంచనాలతో కలిపి 5000 కోట్ల లోపే పూర్తయ్యే ప్రాజెక్టు అని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. తన కేబినెట్లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందని.. అందరూ అనుభవజ్ఞులేనన్నారు. వారి శాఖలో వారంతా సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. తన పాలన అద్భుతంగా ఉందన్నారు. ఎవరి ఫోన్లో వాళ్ళు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నానన్నారు. కేంద్రానికి పన్నులు ఎంత కడుతున్నామో అంతే స్థాయిలో రాష్ట్రాలకు వాటా రావాలని డిమాండ్ చేశారు. 

Also Read :  ఇక మనుషుల అవసరం ఉండదేమో!.. సీక్రెట్‌ భాషలో మాట్లాడుకుంటున్న రెండు ఏఐ అసిస్టెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment