/rtv/media/media_files/2025/02/26/eVLXwhbQnt7BVdD4iOLu.jpg)
CM Revanth Reddy, PM Modi
నిన్న రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. పధాని కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ సమాచారం రావడంతో వెంటనే బయలుదేరి వెళ్ళినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ అవనున్నారు. గత ఏడాది జూలైలో ప్రధానిని కలిసిన సీఎం మళ్ళా ఆరు నెలల తర్వాత ఇప్పుడే కలుస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డితో మాట్టాడారు. ఈరోజు మీటింగ్ లో కూడా దీనిపై పూర్తి విచారణ జరపనున్నారని తెలుస్తోంది, దీంతో తెలంగాణ లో పలు ప్రాజెక్టులపై సీఎం కేంద్ర సాయం కోరనున్నారు.
Also Read: TS: నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ స్వాధీనం..కోర్టు ఆదేశాలు
పలు ప్రాజెక్టుల్లో కేంద్ర సహాయం..
మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం సహాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కోరనున్నారు. దీంతో పాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను ప్రధానికి వివరించనున్నారు. ప్రధానితో భేటీ తర్వాత రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలను కలసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: CBSE: 2026 నుంచి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్