TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

నేడు తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 3 లక్షల కోట్లకు పైనే ఉండబోతుందని తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

New Update
Telangana Budget

Telangana Budget

 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి  తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉండనుందని తెలుస్తోంది.ప్రస్తుత ఏడాది బడ్జెట్‌ రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆదాయం అంచనాల కన్నా రూ.50 వేల కోట్ల వరకూ తగ్గుదల నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క,శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు.

Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

సభలో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.పన్నేతర ఆదాయం, కేంద్రం  నుంచి గ్రాంట్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాది ఆదాయలక్ష్యాల మేరకురాలేదు. కాంగ్రస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో తొలుత ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ఏప్రిల్‌,మే,జూన్‌ నెలల కోసం శాసనసభలో ప్రవేశ పెట్టింది.

Also Read: Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు

TG Budget 2025 Today

మిగిలిన 9 నెలల కోసం 2024జులై 25న పూర్తి పద్దును ప్రవేశపెట్టింది.మొత్తం ఆర్థికసంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ ను తొలిసారి ఇప్పుడు ప్రవేశపెట్టబోతుంది.రాష్ట్ర ఆదాయం పై పూర్తి వాస్తవాలు తెలిశాయని, వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ ను ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని సమాచారం. కొత్తగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌,ఫ్యూచర్‌ సిటీ,మెట్రో రైలు విస్తరణ,ప్రాంతీయ వలయ రహదారి,దీనికి అనుసంధానంగా రేడియల్‌ రోడ్ల నిర్మాణం వంటివాటికి కూడా బడ్జెట్ లో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ప్రధానంగా నీటిపారుదల,వ్యవసాయం,విద్య,రోడ్లు భవనాలు,గృహనిర్మాణం,ఇంధన శాఖలకు అత్యధికంగా నిధులు దక్కనున్నాయి.

సాగునీటి పారుదలశాఖ రూ. 26 వేల కోట్లు అడిగింది. విద్యాశాఖ రూ.30 వేల కోట్లు అడిగినట్లు సమాచారం. కొత్తగా నిర్మించే యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలకే రూ.11 వేల కోట్లు అవసరమని అంచనా. వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకానికి ,కరెంటు ఛార్జీలు పెంచకుండా రాయితీ భరించేందుకు కలిపి రూ.21 వేల కోట్లు కావాలని రాష్ట్ర ఇంధనశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా దాదాపు రూ.18 వేల కోట్లుకేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇంధనశాఖకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించుకుంటే వచ్చే నెల ఒకటి నుంచి కరెంటు ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నందున అడిగిన సొమ్ములో అత్యధికశాతం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

గ్యారంటీ హామీల అమలు కింద..వచ్చే ఏడాది రైతు భరోసాకు రూ.15 వేల కోట్లు, 9.69 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.37,274 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. రాజీవ్యువవికాసం పథకానికి రూ.6 వేల కోట్లు,కొత్తగా ప్రారంభించే నగరాభివృద్ది పథకానికి రూ. 4వేల కోట్లు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు రూ.4 వేలకోట్లు,పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచితకరెంటుకు రూ.2 వేల  కోట్లు అవసరమని సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయి.

ఇవన్నీ గ్యారంటీ హామీల పద్దు కింద వస్తున్నందున భారీగానిధులు కేటాయించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికలు ఆయా వర్గాల సంక్షేమ పథకాలకు ఈ ఏడాది రూ.63 వేల కోట్లు కేటాయించినందున వచ్చే ఏడాది అంతకంటేపెంచే అవకాశాలున్నాయి.

గతేడాది పద్దులో వైద్య ఆరోగ్య శాఖు ప్రభుత్వం రూ.11,800 కోట్లు కేటాయించింది. ఈసారి కనీసం రూ.18 వేల కోట్ల వరకు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వాన్నికోరినట్లు తెలిసింది. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పై ఇచ్చిన గ్యారంటీ హామీఅమలులో భాగంగా ప్రభుత్వం మరిన్నినిధులు కేటాయించే యోచనలో ఉంది.ఈ పథకానికి ఇప్పుడు ప్రతినెలారూ.50 కోట్లు అందుతున్నాయి. వీటిని రూ. వంద కోట్లకు పెంచాలని వైద్యాశాఖ కోరినట్లు తెలిసింది.

Also Read: Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు- వైజాగ్ యువకుడు మృతి!

Also Read: Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు