TG Assembly: జగదీష్ రెడ్డిపై వేటు.. స్పీకర్ సంచలన నిర్ణయం!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సభ మన అందరిది, సభ మీ ఒక్కరిది కాదంటూ ఈ రోజు జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

New Update

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadeesh Reddy) కి బిగ్‌షాక్ ఇచ్చారు. జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల (Budget Sessions) నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు ఉదయం జగదీష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. సభ మన అందరిది, సభ మీ ఒక్కరిది కాదంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి కామెంట్స్‌పై స్పీకర్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌తో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.

Also Read :  World Kidney Day 2025: ఈ ఐదుగురికి కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఎక్కువ! అందులో మీరూ ఉన్నారా

Also Read :  ఇదేం ట్విస్టు రా బాబు.. ‘మా పెళ్లాలు తాగుడుకు బానిసయ్యారు’.. పోలీస్ట్ స్టేషన్‌కు భర్తలు!

భగ్గుమన్న బీఆర్ఎస్..

జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోను మంత్రులు పరిశీలించారు. అనంతరం జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి ఆమోదం లభించడంతో జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ఈ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సభలో ఆందోళనకు దిగారు. జగదీష్ రెడ్డిని బయటకు పంపించేందుకు వచ్చిన మార్షల్స్ తో హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వాగ్వాదానికి దిగారు. 

Also Read :  ‘స్మార్ట్‌ రేషన్‌ కార్డు’లు వచ్చేస్తున్నాయహో.. మార్చి 25న దానికి తుది గడువు!

Also Read :  శ్రీశైలంలో అపచారం.. మండి పడుతున్న హిందూ సంఘాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు