BRS Jagadeesh Reddy: విద్యుత్ కొనుగోళ్లతో నష్టం కాదు.. లాభం జరిగింది: జగదీశ్ రెడ్డి చెప్పిన లెక్కలివే!
ఛత్తీస్గఢ్ తో గత కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంతో రూ.6000 కోట్ల నష్టం కాదు... అంతకు మించి లాభం జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుందని ప్రశ్నించారు.