BREAKING: గ్రూప్‌-1 నియామకాలు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

TGPSC గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

New Update
Supreme Court

Supreme Court

TGPSC గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్‌ బెంచ్ కొట్టివేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని.. ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, మళ్లీ పరీక్షలు పెట్టాలని అభ్యర్థించారు.

Also Read: కాళేశ్వరంపై రాజ్యసభలో రగడ.. కిషన్ రెడ్డి VS ఎంపీ సురేశ్‌ రెడ్డి

 దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్‌.. గ్రూప్ 1 పరీక్షలు అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టులు పిటిషన్ వేశారు. తమ వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఇప్పటికే మూడుసార్లు మూల్యాంకనం చేసినట్లు TGPSC తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నియామక ప్రక్రియ చేపట్టామన్నారు. చివరికి ఇరువైరుపులా వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.  

Also Read: ఢిల్లీలో లక్షకు పైగా సీసీ కెమెరాలు తొలగింపు.. ఎందుకో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు