TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.... అప్రమత్తమైన సర్కార్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో మరోసారి సమ్మె గండం నెలకొంది. తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) సమ్మె సైరన్ మోగించింది. అయితే సమ్మెను విరమింప జేయడానికి ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది.

New Update
tgrtc speical buses

TGSRTC

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో మరోసారి సమ్మె గండం నెలకొంది. తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) సమ్మె సైరన్ మోగించింది. ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు. వీటి పరిష్కారంలో జాప్యం జరుగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సంస్థలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు అనుమతించాలని, గతంలో ఉన్న హక్కులను కల్పించాలని కోరుతున్నారు.పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని , ఇతర ప్రయోజనాలను కల్పించాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.

జేఏసీ నాయకులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచి (అంటే ఏప్రిల్ 22 మొదటి షిఫ్ట్ నుండి) రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. గత పదిహేను రోజులుగా డిపోల వారీగా పర్యటిస్తూ కార్మికులను సమాయత్తం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Also Read :  తెలంగాణలో కొత్త స్కీమ్.. వారికి రూ.5 లక్షల బెనిఫిట్.. వివరాలివే!

సమస్యల పరిష్కారానికి కమిటీ

టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు జి.ఓ.ఎం.ఎస్.నెం.66 విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగుల నుంచి, వారి సేవా నిబంధనలు, సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి.వినతులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, TGRTC ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం ఈ క్రింది అధికారుల కమిటీనికమిటీ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు & భవనాల శాఖ - ఛైర్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ - సభ్యుడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ - సభ్యుడు వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ - సభ్యుడు, కన్వీనర్‌ తదితరుగామిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుంది

ప్రభుత్వం స్పందన - చర్చలకు ఆహ్వానం:

సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలకు చర్చలకు ఆహ్వానించింది.సాయంత్రంలోపు JAC నేతలు తమకు అందుబాటులో ఉండాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు సూచించారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె చేస్తామని ఆర్టీసీ జేఏసీ వార్నింగ్(tgsrtc jac demands) ఇచ్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోతాయని అల్టిమేటం ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే చర్చలకు రావాల్సిందిగా ఆర్టీసీ జేఏసీ నేతలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం.

Also Read :  రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రంగంలోకి పొన్నం ప్రభాకర్‌

సమ్మెను అడ్డుకునేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) రంగంలోకి దిగారు. సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని కార్మిక సంఘాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని, కార్మికులు తమను కలిసి చర్చించుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు, జేఏసీ నాయకులు కూడా చర్చలకు సిద్ధమని, అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి సాయంత్రం లోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు.

ఆర్జసీ కార్మికులకు సంబంధించిన సమ్మె(tgsrtc bus strike) పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చన్నారు.ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి  ,నేను  ప్రభుత్వం  దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని  సమస్యలు పరిష్కారం చేస్తాం..65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారన్నారు.

ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ లాంటిదని, ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉందన్నారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం  ప్రయాణికుల సౌలభ్యం చూస్తామన్నారు.ఎలాంటి భేషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు.

సామాన్యులకు ఇబ్బంది

ఒకవేళ చర్చలు విఫలమై సమ్మె గనుక జరిగితే, నిత్యం ఆర్టీసీపై ఆధారపడి ప్రయాణించే లక్షలాది మంది సామాన్యులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో ఆర్టీసీ యాజమాన్యం,ప్రభుత్వం తక్షణమే ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఏర్పడింది.

Advertisment
తాజా కథనాలు