/rtv/media/media_files/2025/03/27/ygqgxtTSI21f7IKwJKFw.jpg)
SLBC Tunnel Rescue Operation Cadaver Dogs Entry
SLBC: SLBC సొరంగంలో మరణించిన మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. టన్నెల్‌లోకి మరోసారి కడావర్ డాగ్స్ పంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కడావర్ డాగ్స్‌ను గురువారం ఉదయం 11 గంటలకు సొరంగంలోనికి పంపినట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి (IAS) చెప్పారు.
3 షిఫ్టుల్లో 600 మంది సిబ్బంది..
ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి (IAS) ని నియమించింది. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు 34 రోజులుగా నిరంతరం సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ప్రతిరోజు3 షిఫ్టులలో 600 మంది సిబ్బంది పాల్గొంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. సహాయక బృందాల మధ్య పూర్తిస్థాయి సమన్వయంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు తెలియజేశారు. టన్నెల్ ప్రమాదం జరిగిన రోజు నుంచి నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సహాయక చర్యల్లో భాగంగా సొరంగంలో ఉన్నటువంటి మట్టిని, టీబీఎం భాగాలను, ఊట నీటిని తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
టన్నెల్ లోపల వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నాం. నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నాం. సహాయక చర్యలలో పాల్గొంటున్న సహాయక సిబ్బందికి కావలసిన ఆహరం, వసతి, ఆరోగ్యం తదితర సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
tunnel | telangana | telugu-news | today telugu news