/rtv/media/media_files/2025/02/22/yWDMQOCo0oiZPENL2Ie4.jpg)
SLBC Tunnel Incident
శనివారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలింది. పలువురు కార్మికులు బయటకు రాగా.. మరికొందరు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. ఘటనాస్థలాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. '' శనివారం ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లారు. 8.30 గంటలకు బోరింగ్ మిషన్ ఆన్ చేశారు.
Also Read: రైల్వేశాఖ షాకింగ్ నిర్ణయం.. జనరల్ టికెట్ ప్రయాణికులకు ఇక చుక్కలే..?
టన్నెల్‌లో ఓవైపు నుంచి నీరు లీకైంది. దీంతో మట్టి కుంగి పెద్ద శబ్దం వచ్చింది. టీబీఎం ఆపరేటర్ ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారు. 42 మంది కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటికి వచ్చారు. అయితే బోరింగ్ మిషన్ ముందున్న 8 మంది అందులోనే చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ 8 మంది ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నాం. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటన జరిగినప్పుడు టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లని బయటకి తీసిన రెస్క్యూ నిపుణులతో మాట్లాడాం.
Also Read: ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయివారు ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వాసులు. వాళ్లలో ఒక ప్రాజెక్టు ఇంజినీరు, ఫీల్డ్ ఇంజినీర్, నలుగురు కార్మికులు ఉన్నారు. అలాగే జమ్మూకశ్మీర్, పంజాబ్‌కు చెందిన ఇద్దరు బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లకి వెంటిలేషన్ ఇబ్బంది లేదు. 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కుపోవడంతో వాళ్లని బయటకు తీయడం సవాలుగా మారింది. శనివారం రాత్రికి రెస్య్కూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుంటాయని'' మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్!
Also Read: పెళ్లిచేస్తాం, గిఫ్ట్‌లు ఇస్తామని నమ్మించారు.. చివరికి ఊహించని షాక్