/rtv/media/media_files/2025/01/23/jkNUBL2zu5H7ZkmzPe9J.jpg)
guru
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా అటు ఫ్యామిలీ థీమ్ తో పాటు..ఇటు క్రైమ్ థ్రిల్లర్ మూవీగానూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఓ ఆర్మీ మాజీ జవాన్ మాత్రం ఆ సినిమా చూపించి ఇంటికి వచ్చిన తరువాత భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు.
Also Read: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గురుమూర్తి భార్య హత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరిగిన రోజు గురుమూర్తి, భార్య వెంకట మాధవి, పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కి వెళ్లారు. మూవీ చూసిన వచ్చిన తరువాత పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్ద విడిచి పెట్టి వచ్చాడు.
వచ్చే దారిలోనే ఇద్దరికి చిన్నగా ఘర్షణ మొదలైంది. అది కాస్తా ఇంటికి వచ్చేసరికి పెద్దది అయ్యింది. దీంతో మొగుడు పెళ్లాలు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే మాధవి ఆవేశంతో మెడలో తాళి తీసి గురుమూర్తి మోహం మీద విసిరి కొట్టింది.
Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూపించి.. భార్యను కుక్కర్లో ఉడికించి చంపిన భర్త!
Gurumurthy Case
అంతే గురుమూర్తి ఇంకా రెచ్చిపోయి ఆమెను గట్టిగా గోడకు అదిమి పెట్టి కొట్టాడు. దాంతో ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆ విషయం తెలియని గురుమూర్తి ఇంకా ఆమెను కొడుతూనే ఉన్నాడు. స్పృహ తప్పి పడిపోయిందనుకుని కాసేపు ఊరుకున్నాడు. కానీ ఎంతసేపటికీ లేవకపోయే సరికి భార్య దగ్గరకు వెళ్లి చూశాడు.ఆమె అప్పటికే చనిపోయింది.
దీంతో ముందే భార్యను చంపేయాలని ఎప్పటి నుంచో ప్రణాళికలు వేసుకుంటున్న గురుమూర్తికి కాలం కలిసి వచ్చింది.అంతే వెంటనే రెండు పెద్ద పెద్ద కత్తులు ఎప్పుడో తెచ్చి ఇంట్లో దాచి ఉంచాడు.వాటిని బయటకు తీశాడు. భార్య శరీరంలోని మెత్తటి మాంసాన్ని అంతటిని కూడా కోసి, దానిని నీళ్ల బకెట్ లో వేసి హీటర్ పెట్టి సుమారు 6 గంటల సేపు ఉడికించాడు.
ఆ తరువాత దానిని ఎండబెట్టాడు. మిగిలిన మాంసాన్ని రెండు కుక్కర్లలో వేసి చాలా సార్లు ఉడకబెట్టాడు. అన్ని సార్లు ఉడికిస్తున్నప్పటికీ పక్కన వారికి ఎవరికీ అనుమానం రాకపోవడం విశేషమనే చెప్పుకోవాలి. భార్య శరీరంలోని ఎముకలను పొడిచేసి ఆ పొడిని కవర్లలో నింపుకుని డ్రైనేజీలో కలిపేశాడు.
ఆ తరువాత ఉడికించిన మాంసాన్ని కూడా నల్ల కవర్లలలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవాడు. 16 వ తేదీ నుంచి మాధవీ కనిపించడం లేదు. అయినప్పటికీ ఇంటి చుట్టుపక్కల వారు కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ గురుమూర్తిని ప్రశ్నించలేదు. అన్ని సార్లు కవర్లు పట్టుకుని తిరుగున్న వ్యక్తి దగ్గర నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా ఉందా...అనే సందేహాలు ఇప్పుడు బోలెడు వ్యక్తం అవుతున్నాయి.
డ్రైనేజీలో ఆమె శరీర భాగాలను కలిపినట్లు చెబుతున్నాడు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అసలు ఈ దుర్మార్గుడు చంపింది భార్యనేనా అనే అనుమానాలు కూడా చాలానే వ్యక్తం అవుతున్నాయి.అయితే, అతడే నేరం చేశాడని చెబుతున్నప్పటికీ.. చనిపోయింది అతని భార్యేనని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో పోలీసులకు ఈ కేసు పెద్ద చిక్కుముడిలా ఉంది.
అయితే ఈ కేసులో పోలీసులకు ఉన్న ఒకే ఒక్క దిక్కు డీఎన్‌ఏ టెస్టు. దాని ద్వారా చనిపోయింది ఎవరు అని తెలుసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.
Also Read: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీర్పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తి
Also Read: భార్యను చంపేందుకు కుక్కతో ప్రాక్టీస్.. ఒరేయ్ నువ్వు మనిషివేనా!