/rtv/media/media_files/2025/03/05/3dpvE856mC5M9KuAaYmP.jpg)
mamunur airport
Warangal Airport : వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు విమానశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేస్తున్నారు. ఇటీవల ఎయిర్ పోర్టు పనుల కోసం వెళ్లిన అధికారులను భూ యజమానులు అడ్డుకున్నారు. తాజాగా సర్వేకు వెళ్లిన రెవెన్యూ అధికారులను అడ్డుకుని నిరసన తెలిపారు. జై జవాన్ జై కిసాన్ అంటూ రోడ్డెక్కి నినాదాలు చేశారు.
తమకు న్యాయం జరిగేదాకా భూముల సర్వేను ముందుకు కదలనివ్వమని తేల్చిచెప్పారు.
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేదాకా భూములివ్వమని రైతులంటున్నారు. ముఖ్యంగా నక్కలపల్లి, గుంటూరు పల్లి, గాడి పల్లి, నల్లకుంట గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి ఆందోళన చేస్తోన్న రైతులను అడ్డుకున్నారు. ధర్నాకు ఎటువంటి అనుమతి లేదని వెంటనే ఆందోళన విరమించాల్సిందిగా సూచించారు. దాదాపు 200 మంది రైతులు తమకు న్యాయం జరిగే వరకు ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
Also read : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!
ఇక ఎయిర్ పోర్ట్ భూసేకరణ పై గతంలో కొండా సురేఖ రైతులతో సమావేశాన్ని నిర్వహించి రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు, మామునూరు ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ఎకరా ఐదు కోట్లకు పైగా ధర పలుకుతుందని, దాని ప్రకారమే అన్నదాతలకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం చెల్లించకపోతే అదే ధర ఉన్న వ్యవసాయ భూములు తమకు తిరిగి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇక హామీ ఇచ్చిన ప్రకారంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని అల్టిమేటం జారీ చేశారు. ఇక విమానాశ్రయం పునరుద్ధరణలో భాగంగా నక్కలపల్లి రహదారిని క్లోజ్ చేస్తున్నారని తమకు ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో విషాదం.. కాబోయే భార్యను ఆటపట్టించబోయి మృతి.. అసలేమైందంటే..!