/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TELANGANA-LOGO.jpg)
వ్యవసాయాన్ని పెంచేందుకు, రైతులకు లాభం కూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను అనౌన్స్ చేసింది. రైతులు పెట్టే పెట్టుబడులకు సాయం చేస్తామని చెప్పింది. దీని ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటూ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించడానికి, అవసరమైన వనరులు సేకరించడానికి కూడా హెల్ప్ చేస్తామని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి రైతు భరోసాలో మార్పులు చేసింది.
రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18… pic.twitter.com/Z8jzuw2G40
— Telangana CMO (@TelanganaCMO) January 12, 2025
ఎకరాకు 12 వేలు..
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మారిన రైతు భరోసాను ఈ నెల 26 నుంచి అమలు చేయనుంది. దీనిప్రకారం పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు 12వేలుకు పెంచింది. భూ భారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ భూములున్న వారందరికీ దీనిని ఇవ్వనుంది. అలాగే వ్యవసాయం యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగించనుంది. ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఆర్‌బీఐ నిర్వహించే డీబీటీ (DBT) పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయనుంది.
Also Read: HYD: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్