/rtv/media/media_files/2025/03/13/KoaBsnbbDhgWIXY2jJie.jpg)
vegetabless
దేశ ప్రజలకు ధరల భారం నుంచి ఉపశమనం లభిస్తోంది. నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగడంతో ఇబ్బందులు పడిన ప్రజలకు గత కొద్ది రోజులగా ఊరట దొరుకుతుంది. ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టి దిగివస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు అనుగుణంగానే ధరలు దిగివస్తుండడం ప్రజలకు భారీ ఊరటగా చెప్పవచ్చు. 2025, ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్ఠానికి దిగివచ్చింది. దీంతో 3.61 శాతంగా నమోదైంది.
Also Read: Telangana: తెలంగాణవాసులకు వాతావరణ శాఖ ముఖ్య సమాచారం.. ఇక ఎండ దంచుడే దంచుడు!
ఇది రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4 శాతం లోపే ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వృద్ధి రేటును పెంచే లక్ష్యంగా ఏప్రిల్‌లో జరిగే ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో కీలక పాలసీ రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా లెక్కగడతారు. కూరగాయలు, కోడి గుడ్లు సహా ప్రోటీన్ ఉత్పత్తుల ధరలు ఫిబ్రవరి నెలలో భారీగా దిగివచ్చాయి.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!
ఈ క్రమంలోనే రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది 2024, ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.09 శాతంగా ఉండగా 2025 జనవరిలో 4.26 శాతంగా నమోదైంది. గతేడాది 2024, జులైలో 3.54 శాతం కనిష్ఠ స్థాయిని తాకగా ఆ తర్వాత ఈ ఫిబ్రవరి నెలలో నమోదైన 3.61 శాతమే కనిష్ఠం కావడం గమనార్హం.
రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరి గణాంకాలు రాష్ట్రాల వారీగా చూసుకుంటే దేశంలో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత తక్కువ రేటు నమోదైంది. తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బోణం కేవలం 1.31 శాతంగా నమోదైంది. ఇక అత్యధిక ద్రవ్యోల్బణం రేటు కేరళలో నమోదైంది. అక్కడ ధరల పెరుగుదల 7.31 శాతంగా ఉంది.
ఫిబ్రవరి నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణాన్ని చూసుకుంటే 3.75 శాతానికి పరిమితమైంది. ఈ ఏడాది జనవరి నెలలో ఇది 5.53 శాతంగా ఉంది. దాంతో పోలిస్తే 222 బేసిస్ పాయింట్ల మేర దిగివచ్చింది. 2024, ఫిబ్రవరి నెలతో పోలిస్తే గత ఫిబ్రవరి లో ద్రవ్యోల్బణం రేటు బాగా తగ్గిన కీలక ఉత్పత్తుల్లో అల్లం -35.81 శాతం, జీల కర్ర -28.77 శాతం, టమాటా -28.51 శాతం, కాలీప్లవర్ -21.19 శాతం, వెల్లుల్లి -20.32 శాతంగా ఉన్నాయి. ఇక కొబ్బరి నూనె 54.48 శాతం, కొబ్బరి 41.61 శాతం, పసిడి 35.56 శాతం, వెండి 30.89 శాతం, ఉల్లిపాయలు 30.42 శాతంగా ఉన్నాయి.
పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణం చూసుకుంటే ఈ ఏడాది జనవరి నెలలో 3.87 శాతంగా ఉండగా అది ఫిబ్రవరి నెల వచ్చే సరి 3.32 శాతానికి దిగివచ్చింది. అలాగే గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణం 4.59 శాతం నుంచి 3.79 శాతానికి తగ్గింది. దీంతో నిత్యావసర సరుకుల భారం భారీగా తగ్గి ప్రజలకు ఉపశమనం లభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Ranya Rao Case: రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధు!