/rtv/media/media_files/2025/03/21/ivtSF4wDay4vCdOUzc22.jpg)
Online Betting
Online Betting : తెలంగాణలో పోలీసులు బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఘటనలో పలువురు సెలబ్రిటీలతో పాటు యుట్యూబర్లను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసి యువత జీవితం నాశనం అయ్యే విధంగా చేస్తున్న సెలబ్రిటీల పైన పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. అయినప్పటికీ కేటుగాళ్లు ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహణ ఆపడం లేదు. తాజాగా..హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
మధురానగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఓ ముఠా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు పక్కా సమాచారంతో రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన ఐదుగురిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు విపరీతంగా వస్తాయంటూ ఈ ముఠా నకిలీ వీడియోలు తయారు చేయించింది. ఈ ఫేక్ వీడియోలను చూపెడుతూ పలువురిని ఆకర్షించింది. దీంతో.. ఈ ముఠా వలలో పడి ఎంతో మంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
చాలా మంది యువకులు బెట్టింగ్ యాప్స్‌లో తమ జీవితాన్ని పణంగా పెట్టారు.. చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. కొంతమంది చావు బతుకుల మధ్య ఇంకా కొట్టుమిట్టాడు తున్నారు. ఇంకా చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూనే ఉన్నారు. సెలబ్రిటీలు చేస్తున్న ప్రచారానికి చాలామంది ఆకర్షితులై వాటిలో పెట్టుబడి పెట్టారు.. గేమ్స్ ఆడారు.. డబ్బులు పోగొట్టుకున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తోంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 11 మంది సెలబ్రెటీల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో సినీ రాజకీయ రంగంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ పైన కూడా కేసు పెట్టారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసి కోట్ల రూపాయలను సంపాదించిన హర్ష సాయి, సన్నీ యాదవ్, రాజు భయ్యా, నటి శ్యామల, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్ టేస్టీ సన్నీ ఇలా మొత్తం 11 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్