JNTU కీలక నిర్ణయం.. యూజీ, పీజీ విద్యార్థులకు మంచి అవకాశం

ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు సంబంధించి JNTU కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. JNTU అనుబంధ, గుర్తింపు పొందిన కాలేజీల్లో చదివి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉన్న అభ్యర్థులకు వన్‌టైం ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) అవకాశాన్ని కల్పించింది.

New Update
JNTU

JNTU

ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు సంబంధించి JNTU కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. JNTU అనుబంధ, గుర్తింపు పొందిన కాలేజీల్లో చదివి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉన్న అభ్యర్థులకు వన్‌టైం ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) అవకాశాన్ని కల్పించింది. వర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ జి..కృష్ణమోహన్‌రావు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అన్ని రకాల అవకాశాలు పూర్తయిన యూజీ, పీజీ అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. 

Also read: నటి రన్యా రావుకు బెయిల్‌.. ఏడాది తర్వాత జైలు నుంచి రిలీజ్

One Time Chance For JNTU Engineering UG And PG Students

ఇలాంటివారు మొత్తం 10 వేల మంది దాకా ఉన్నట్లు JNTU గుర్తించింది. అయితే ఈ సప్లీ పరీక్షలు జూన్, జులైలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు  వర్సిటీ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. 

Also Read: పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..

యూజీ, పీజీ లాబొరేటరీ పరీక్షలు, వైవా, పీజీ కాంప్రెహెన్సివ్ వైవా ,సెమినార్లు, యూజీ ప్రాజెక్టులు ఆయా కాలేజీల్లో జూన్ 10 నుంచి 23వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇక ఇతర వివరాల కోసం వర్సిటీ పరీక్షల విభాగంలోని 80081 03825 నంబర్‌వు సంప్రదించవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Advertisment
తాజా కథనాలు