New Ration Cards: మార్చి 1న లక్ష రేషన్ కార్డుల పంపిణీ.. ఈ జిల్లాల వారికి మాత్రమే

తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీక మార్చి 1 ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫస్ట్ హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దాదాపు లక్షా 20 వేల రేషన్ కార్డులను అర్హులకు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగితా జిల్లాలకు ఇవ్వనున్నారు.

New Update
ration card

ration card

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల (New Ration Cards) జారీపై సస్పెన్స్‌ వీడింది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టకొని ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న వారికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ముందుగా  సంక్రాంతి, జనవరి 26 తేదీల్లో రేషన్‌ కార్డుల పంపిణీని చేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ ఆ సమయంలో కుదరలేదు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. మార్చి 1న కొత్త కార్డులను పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది.

ఇది కూడా చదవండి: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్‌!

Also Read :  జలియన్ వాలా బాగ్ హత్యాకాండ వెనుక కుట్ర ఏంటి? 'ది వాకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌' ట్రైలర్

New Ration Cards In Telangana on March 1st 2025

ఒకే రోజు లక్ష కొత్త రేషన్‌ కార్డులను అందించనున్నారు రాష్ట్ర పౌరసరఫరా శాఖ అధికారులు. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1న హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నది. మిగిలిన జిల్లాల్లో మార్చి 8 తర్వాత అందించనుంది. రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్‌కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్‌ సర్కారు కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!

రంగారెడ్డి జిల్లాలో 24 వేలు, వికారాబాద్‌ జిల్లాలో 22 వేలు, నాగర్‌కర్నూల్‌లో 15 వేలు, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 13 వేల చొప్పున, నారాయణపేట జిల్లాలో 12 వేలు, మేడ్చల్‌ మల్కాజిగిరి, వనపర్తి జిల్లాల్లో 6 వేల చొప్పున, హైదరాబాద్‌‌లో 285 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

Also Read :  ఏనుగుల దాడిపై పవన్ దిగ్భ్రాంతి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు