TS: నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ స్వాధీనం..కోర్టు ఆదేశాలు

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు , గడ్డెన్న వాగు పరిహారం చెల్లింపుల్లో ఆలస్యంపై నిర్మల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అక్కడి సివిల్ జడ్జి సంచలన తీర్పును వెలువరించారు. నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. 

New Update
ts

Nirmal collectorate

గడ్డెన్న వాగు, శ్రీరాంసాగర్‌ జలాశయంలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించాలని ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. దీనిపై బాధితులు కోర్టుకు వెళ్ళగా...కోర్టు కూడా చాలాసార్లు వెంటనే చెల్లించండి అంటూ దేశాలు జారీ చేసింది. అయితే నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో లు మాత్రం ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. బాధితులు కాళ్ళరిగేలా తిరుగుతున్నా...కష్టాలు పడుతున్నా వారిని మాత్రం పట్టించుకోలేదు. దీంతో మరోసారి వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.  బాధితులకు ఆ పరిహారం చెల్లించడంలో కలెక్టర్‌ ఆఫీస్, ఆర్డీవో కార్యాలయం అధికారులు జాప్యం చేయడం సహించే విఫయం కాదని కోర్టు అంది.  ఈ క్రమంలో బాధితులు కోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం.. కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ తీర్పు ఇచ్చారు. 

Also Read: USA: ట్రంప్, జెలెన్ స్కీ మధ్య కోల్డ్ వార్..అసలేం జరుగుతోంది..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు