Parents Support Bill : తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం కట్‌.. తెలంగాణ కొత్త చట్టంలో ఏముందో తెలుసా?

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోకుండా నిర్లక్ష్యం వహించే సంతానానికి ప్రభుత్వం షాక్‌ ఇవ్వనుంది. వారి జీతం కట్‌ చేయనుంది. జీతంలో 15 శాతం లేదా రూ.10 వేలు కట్‌ చేసి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించడానికి  ప్రభుత్వం సిద్ధమైంది.

New Update
Telangana Cabinet in Medaram

Telangana Cabinet

Parents Support Bill : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోకుండా నిర్లక్ష్యం వహించే సంతానానికి ప్రభుత్వం(telangana-govt) షాక్‌ ఇవ్వనుంది. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా, ప్రైవేటు ఉద్యోగులు అయినా వాని జీతం కట్‌ చేయనుంది. జీతంలో 15 శాతం లేదా రూ.10 వేలు కట్‌ చేసి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించడానికి  ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ప్రభుత్వం  తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు(new-law) ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ బిల్లును మానవీయ కోణంలో, సామాజిక భద్రతను పెంచే విధంగా రూపొందించింది.సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm-revanthreddy) అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు  తల్లిదండ్రుల సంరక్షణ చట్టం (Parents Support Bill): తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో నుండి 15% కోత విధించి, వారి తల్లిదండ్రులకు ఇచ్చే చట్టం గురించి చర్చించి బిల్లు ఆమోదించారు.

Also Read :  Operation Kagar క్లైమాక్స్: 2026 మార్చి 31 డెడ్ లైన్.. మిగిలిన మావోల లెక్కలివే!

చట్టం ఏం చెబుతోంది?

కాగా ఈ చట్టం ప్రకారం  ప్రభుత్వ , ప్రైవేటు ఉద్యోగులు ఎవరైన సరే వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించకపోతే వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభత్వం ఈ చట్టం తీసుకురానుంది. ఉద్యోగులు ఎవరైనా తమ తల్లిదండ్రులను సంరక్షించకుండా వారిని అనాథలుగా వదిలిస్తే. ఆ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకువస్తోంది. దీనిప్రకారం సదరు ఉద్యోగి వేతనంలో కొంత మొత్తాన్ని కట్‌ చేసి ఆ మొత్తాన్ని నేరుగా ఆ ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాలోకి జమ చేసేలా ఈ చట్టాన్ని తెస్తోంది. ఆ ఉద్యోగి సాధించే వేతనంలో 15 శాతం లేదా రూ.10,000 అంటే ఏది తక్కువగా ఉంటే అది కట్‌ చేస్తారు. కాగా చట్టానికి సంబంధించి అసోంలో ప్రణామం(పేరెంట్స్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ నార్మ్‌ ఫర్‌ అకౌంటబిలిటీ అండ్‌ మానిటరింగ్‌) అనే చట్టం తరహాలో రూపందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఈ కొత్తచట్టానికి ‘తెలంగాణ ఎంప్లాయీస్‌ అకౌంటబిలిటీ అండ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ పేరెంటల్‌ సపోర్ట్‌ యాక్ట్‌ (టిఈఏఎంపీఎస్‌)- 2026 అనే పేరుతో అమల్లోకి తీసుకురానున్నారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 309 ప్రకారం.. ఉద్యోగుల ప్రవర్తన, సర్వీసు నిబంధనలపై చట్టం చేసేందుకు ఉండే అధికారాన్ని సర్కారు ఈ దిశగా వినియోగించనుంది.  ఈ మేరకు క్యాబినెట్‌ సమావేశంలో ఈ టీఈఏఎంపీఎస్‌ బిల్లుపై చర్చించి ఆమోదించారు. దీన్ని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే  ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం గతంలో ‘మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ 2007’ పేరుతో ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం. బాధితులు నేరుగా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి, న్యాయపోరాటం చేయడానికి మాత్రమే అవకాశం ఉంది కానీ,   ‘ఆటోమేటిక్‌ జీతం కోత’ విధానం లేదు.

అసోంలో అమలు

కాగా అసోంలో తీసుకువచ్చిన ప్రమాణం చట్టంలో ఉద్యోగుల నెలవారీ వేతనం నుంచి 15శాతం లేదా రూ.10వేలు మొత్తాన్ని కోత విధించే విధానం ఉంది. ఇప్పటికే దీన్ని అక్కడ విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టంలోనూ ఆటోమెటిక్‌ డిడెక్షన్‌ అంశాన్ని చేర్చడం గమనార్హం. పిల్లల నిర్లక్ష్యానికి గురైన బాధిత తల్లిదండ్రులు తమ సమస్యను సంబంధిత శాఖాధిపతికి (హెచ్‌వోడీ)లేదా ప్రభుత్వం నియమించే ప్రత్యేక అథారిటీకి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది.  సంబంధింత అధికారులు దీనిపై విచారిస్తారు. విచారణలో ఆరోపణలు వాస్తవమేనని తేలితే.. సదరు ఉద్యోగి నెలవారీ వేతనం నుంచి నిర్ణీత మొత్తం ఆటోమేటిక్‌గా కట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఆ సొమ్ము నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమఅయ్యేలా చేస్తారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా తీసుకురానుంది. తల్లిదండ్రులకు ఇద్దరు,ముగ్గురు పిల్లలుండి, వారంతా ఉద్యోగులైతే ఆ మొత్తాన్ని అందరి జీతాల్లో సమానంగా కోత విధించనున్నారు.

Also Read :  నేనే రేవంత్ రెడ్డిని సీఎం చేసింది: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పరిష్కారానికి 45 రోజుల సమయం

కాగా ఈ చట్టాన్ని అములు చేయడానికి కలెక్టర్లకు అధికారం ఇవ్వనుంది. ఒక వేళ కలెక్టర్ల వద్ద కూడా వారికి న్యాయం జరగకపోతే రిటైర్డు జడ్జి నేతృత్వంలోని కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. టీఈఏఎంపీఎస్‌ చట్టం అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత 6-8 నెలల్లో రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు సభ్యులుగా ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్దమైంది. కలెక్టర్ల వద్ద తమకు న్యాయం జరగలేదనుకుంటే .. బాధితులు కమిషన్‌ను ఆశ్రయించడానికి అవకాశం ఉంది. కాగా కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా కార్పొరేషన్లు, బోర్డులు, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల సిబ్బందికి కూడా ఈ చట్టం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ఝయించింది. అయితే.చట్టం వర్తించాలంటే తల్లిదండ్రులకు సొంత ఆదాయం, పెన్షన్‌ లేదా ఇతర అద్దెలు ద్వారా ఆదాయం ఉండకూడదు. కేవలం పిల్లల మీద ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం వర్తించనుంది.

Advertisment
తాజా కథనాలు