/rtv/media/media_files/2025/02/26/UK9rqo8mbgmajA26tT3E.jpeg)
tunnel incident
టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై నాగర్ కర్నూలు జిల్లా (Nagarkurnool District) కలెక్టర్ సంతోష్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. టన్నెల్ లో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. తమకు ఏదైనా సమాచారం అందితే మీడియాకు వెల్లడిస్తామని అన్నారు.
Also Read : ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదు- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
ముమ్మరంగా గాలింపులు
టన్నెల్ (SLBC Tunnel) లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు ముమ్మరంగా గాలింపులు కొనసాగుతున్నాయి. ఆందులో భాగంగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా అక్కడ ఐదు మొత్తని భాగాలు ఉన్నట్లుగా రెస్క్యూ టీమ్ గుర్తించింది. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు. అయితే ఆ మొత్తని భాగాలు మానవ దేహాలు కావచ్చు, కాకపోవచ్చునని అధికారులు అంటున్నారు. దీనిపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also read : నామినేటెడ్ పదవులు వాళ్లకే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రంగంలోకి రైల్వే
సింగరేణి (Singareni), హైడ్రా (Hydra) తో పాటుగా రైల్వేశాఖ సైతం సహాయ చర్యల్లో పాల్గొంది. సొరంగం నుంచి బురద, రాళ్లు, పైపులు, ఇనుప సామగ్రిని లోకో రైల్ వ్యాగన్లలో నింపి బయటకి పంపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రత్యేక నిపుణులతో రెండు బృందాలను నియమించింది. ఇందులో ఒక బృందం ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకుంది. ప్లాస్మా కట్టర్, బ్రోకో కటింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించి భారీ లోహాలను కత్తిరించడంలో రైల్వేలకు నైపుణ్యం ఉందని దక్షిణ మధ్య రైల్వే (SCR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ శ్రీధర్ తెలిపారు. సహాయచర్యలపై రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షిస్తున్నారు.
Also read : జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం...రోజా సంచలన ఆరోపణలు
Also read : కిషన్ రెడ్డివల్లే తెలంగాణకు అన్యాయం-రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు