/rtv/media/media_files/2026/04/18/mptc-and-zptc-elections-update-in-telangana-2026-04-18-07-13-27.jpg)
MPTC, ZPTC Elections update in telangana
తెలంగాణలో MPTC elections, ZPTC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల లిస్టును రెడీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. 10.07.2025 నుంచి 05.02.2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అప్‌డేట్ చేసిన లిస్టులో నియోజకవర్గాల్లోఉన్న అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటికి సంబంధించిన పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలను జత చేయాలని తెలిపింది.
Also Read: డీలిమిటేషన్ చిక్కుముడితో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. బీజేపీ తొందరపడిందా ?
MPTC - ZPTC Elections 2026
వీటి ఆధారంగానే MPTC, ZPTC పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల ఆధారంగా కొత్త లిస్టును తయారుచేయాని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి వెరిఫై చేసిన తర్వాత, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు లింక్ చేయాలని సూచనలు చేసింది. దానికి సంబంధించిన డేటాలో ఏవైనా తేడాలు ఉంటే ఏప్రిల్ 23 లోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది.
Also Read: వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. విజయం సాధించామన్న సీఎం రేవంత్, స్టాలిన్
ఆ డేటాను ఆమోదించిన తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా రిలీజ్ చేస్తారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటారు. అనంతరం తుది జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌ల ఏర్పాట్లు చేస్తారు. ఇదిలాఉండగా MPTC, ZPTC ఎన్నికలు చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీల్లో జరిగాయి. జూన్‌లో MPP, ZP ఛైర్‌పర్సన్లను ఎన్నుకున్నారు. గత ఏడాది జూన్‌లోనే వీళ్ల పదవీకాలం ముగిసింది.
Follow Us