Mood Ganesh: డ్రైవర్‌ నుంచి మేయర్‌ దాకా.. కొత్తగూడెం మేయర్‌గా సీపీఐ నేత మూడ్‌ గణేశ్

కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన నేత మూడ్ గణేశ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ఎన్నికయ్యారు.

New Update
Kothagudem Mayor Mood Ganesh

Kothagudem Mayor Mood Ganesh

Mood Ganesh: కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన నేత మూడ్ గణేశ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ఎన్నికయ్యారు. కొత్తగూడె కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాల్లో గెలిచాయి. దీంతో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ఈ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిపై ఉత్కంఠ నెలకొంది. చివరికి కాంగ్రెస్, సీపీఐ మధ్య సుదీర్ఘ  చర్చల తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను చెరో రెండేళ్ల చొప్పున పంచుకోవాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ముందుగా సీపీఐ పార్టీకి చెందిన మూడ్‌ గణేష్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారు. 

డ్రైవర్‌ నుంచి మేయర్‌ దాకా 

మూడ్ గణేష్ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ఈయన ఆటో డ్రైవర్‌గా, అలాగే ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్‌గా పనిచేశారు. డ్రైవర్‌గా ఉన్నప్పుడే గణేశ్ కార్మిక సమస్యలపై పోరాడేవారు. ఏఐటీయూసీ (AITUC) అనుబంధ డ్రైవర్ల యూనియన్‌లో చురుగ్గా పాల్గొనేవారు. వారి హక్కుల కోసం నిరనసలు, ఆందోళనలు చేస్తుండేవారు. ఆ గుర్తింపుతోనే ఆయన సీపీఐ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. కార్పొరేటర్‌గా గెలిచి నేడు మేయర్ స్థాయికి చేరుకున్నారు. 

Also Read: మేడారం జాతరలో ‘కోవా బన్’ చిచ్చు.. అసలు వివాదం ఎలా, ఎందుకు మొదలైందంటే?

ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 58 స్థానాల్లో బరిలోకి దిగింది. పొత్తు ప్రకారం సీపీఎంకు రెండు స్థానాలు కేటాయించింది. ఇక సీపీఐ 57 స్థానాల్లో పోటీ చేసింది. బీఆర్‌ఎస్‌ 58, బీజేపీ 53, జనసేన 14, బీఎస్పీ 6, ఇతరులు 15, స్వతంత్రులు 91 మంది అభ్యర్థులు పోటీచేశారు. 60 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాల్లో విజయం సాధించాయి. బీఆర్‌ఎస్‌ 8 స్థానాలకే పరిమితమయ్యింది. స్వతంత్రులు 6, బీజేపీ, సీపీఎం ఒక్కో స్థానంలో గెలిచాయి. 

Also Read: ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం‘అన్సార్‌ ఇంటీరియం’ పేరుతో టెర్రరిస్టు గ్రూపు

Advertisment
తాజా కథనాలు