Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది. దానం మరోసారి కేసీఆర్‌కు దగ్గరవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దానం.. కేటీఆర్ కేసు గురించి మాట్లాడుతూ ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఫార్ములా- ఈ విషయంలో రేవంత్ రెడ్డికి జలక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్..ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అప్పట్లోనే ఫార్ములా- 1 తీసుకు రావాలని చంద్రబాబు గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు.. కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు ఫార్ములా-ఈ రావడం వల్ల… pic.twitter.com/BoiaQopruK — Balka Suman (@balkasumantrs) January 10, 2025 అవినీతి జరిగిందా? ఫార్ములా-ఈ కార్ రేస్ గురించి మాట్లాడుతూ.. ఇందులో అవినీతి జరిగిందా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, కేటీఆర్ మాత్రం జరగలేదని చెబుతున్నారని దానం అన్నారు. 'కేటీఆర్ అవినీతిని బయటపెడతామని చెబుతున్నారు. ఏమైనా అవినీతి ఉంటే వెంటనే నిరూపించాలి. ఏ గొడవ ఉండదు. ప్రజల్లో లేనిపోని కన్యూజన్ మొదలైంది. అవినీతి లేదని కేటీఆర్ నిరూపిస్తే సంతోషమే. అవినీతి జరిగితే చట్టమే శిక్షిస్తుంది'అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఒక భోళా శంకరుడు. ఒక గొప్ప నాయకుడు. పైకి ఆగ్రహంగా మాట్లాడినా ఆయనది సున్నితమైన మనసు అంటూ బీఆర్ఎస్ అధినేతను పొగడటంపై కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపుతోంది. ఇది కూడా చదవండి: DK: రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తిక్.. రాయల్స్ తరపున బరిలోకి! కేసీఆర్ ఒక భోళా శంకరుడు.. ఒక గొప్ప నాయకుడుపైకి ఆగ్రహంగా మాట్లాడినా ఆయనది సున్నితమైన మనసు - కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్Video Credits - Satyagrahi pic.twitter.com/8SJJnahk7y — RSP ANDOLE (@IamRSP4BSP) January 10, 2025 హైడ్రా వల్ల ప్రజలకు నష్టమే.. అలాగే హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతోందనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఓటు బ్యాంకు అయిన ప్రజలను కాపాడుకోవాలి. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాలేదు. మన మీద నమ్మకం లేదు. ఇప్పుడైనా పెంచుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఇక హైదరాబాద్‌లోని ఓ డీసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్నారు. కేసులు పెడతానని బెదిరిస్తే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెడ్డపేరు వస్తుందంటూ మరో కోణంలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దానం కామెంట్స్ కాంగ్రెస్ లో కలకలం రేపుతుండగా.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాగేందర్ కామెంట్స్ పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేటీఆర్ విచారణ జరుగుతుండగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నాగేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: Cricket: టీమ్ ఇండియాలో మొదలైన అంతర్గత విభేదాలు.. గంభీర్ వల్లే ఓటములు!