/rtv/media/media_files/2025/03/28/E7hkutcCdHIMiD6JLrFT.jpg)
Minister Seethakka pays tribute to Maoist and her husband Ramu
Seethakka: మాజీ మావోయిస్టు అమరుడు, తన భర్త కుంజా రామును తలచుకుంటూ మంత్రి సీతక్క కన్నీరుపెట్టుకున్నారు. మహబూబాబాద్ మోకాళ్లపల్లిలో రాము వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామునుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, ఆ నైతికతతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు.
కుమ్రాం భీమ్ ఆదర్శాలను నమ్మి, ఆదివాసీ హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన నా భర్త , ఉద్యమ మిత్రుడు కామ్రేడ్ కుంజ రాము గారి 21వ వర్ధంతి సభలో పాల్గొని, ఆయన త్యాగాలను స్మరించుకోవడం భావోద్వేగం కలిగించింది.రాము చూపిన మార్గంలోనే, ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ, పేద, అట్టడుగు వర్గాల… pic.twitter.com/YWz4rb3WYg
— Danasari Seethakka (@meeseethakka) March 27, 2025
ఆయన ఆశయాల సాధనే నా కర్తవ్యం..
ఈ మేరకు 'కుమ్రాం భీమ్ ఆదర్శాలను నమ్మి, ఆదివాసీ హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన నా భర్త , ఉద్యమ మిత్రుడు కామ్రేడ్ కుంజ రాము 21వ వర్ధంతి సభలో పాల్గొని, ఆయన త్యాగాలను స్మరించుకోవడం భావోద్వేగం కలిగించింది. రాము చూపిన మార్గంలోనే, ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ, పేద, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడతా. ఆయన ఆశయాల సాధనే నా కర్తవ్యం. రాము గారి జ్ఞాపకానికి శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నా' అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు సీతక్క.
Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో కుంజా రాము వర్ధంతి సభ నిర్వహించారు. సీతక్క కొడుకు, కోడలు సూర్య, కుసుమాంజలితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాము స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రాము తన 17 ఏళ్ల వయసులోనే ఉద్యమబాట పట్టారు. పలు పోరాటాల్లో కీలక భూమిక పోషించారు. తుది శ్వాస వరకు అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసమే పరితపించారు. నేను ఉద్యమంలో పనిచేసిన సమయంలో రాము నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు. సీతక్క ఏడుస్తుంటే గాయని విమలక్క ఆమెను ఓదార్చుతూ కన్నీరుపెట్టుకున్నారు. ఉద్యమాలపై రాము పాడిన పాటల సీడీని విమలక్క ఆవిష్కరించారు.
Also Read: Kissik Song: 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో.. సెట్ లో బన్నీ, రష్మిక, సుకుమార్ ఎలా చేశారో చూడండి!
warangal | telugu-news | today telugu news