Bus conductor : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!

కండక్టర్ అహ్మద్‌ అన్సారీ సమస్యపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని..  అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచించామని తెలిపారు.

New Update
bus-conductor

bus-conductor

తన ఎత్తు కారణంగా ఆర్టీసీ బస్సులో కండక్టర్ జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న అమీన్‌ అహ్మద్‌ అన్సారీ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్న అహ్మద్‌ అన్సారీ మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే అమీన్‌ అహ్మద్‌ తండ్రి అనారోగ్యం కారణంగా 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్‌ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది.

 అయితే అతను  తన ఎత్తు కారణంగా డ్యూటీలో ఇబ్బందులు ఎదురుకుంటూ మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని అహ్మద్‌ అన్సారీ వాపోతున్నాడు.  అయితే అహ్మద్‌ అన్సారీ సమస్యపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 

Also Read :  ‘బేబి’ నోట బూతు మాట.. ఛీ ఛీ అందరి ముందు అలా అనేసిందేంటి బ్రో?

Also Read :  ఇదెక్కడి ఆఫర్రా మావా.. సగం ధరకే చల్ల చల్లని ఏసీలు!

ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం

ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని..  అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచించామని తెలిపారు. త్వరలోనే సజ్జనార్ అహ్మద్‌ అన్సారీకి వేరే డిపార్ట్  మెంట్ కు బదిలీ చేస్తారని మంత్రి పొన్నం వెల్లడించారు.  

Also read : Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

Also Read :  ఛీ ఛీ రిలేషన్‌కు అడ్డుగా ఉందని.. మూడేళ్ల కుమార్తెను దారుణంగా!

 

Amin Ahmed Ansari | telugu-news | Minister Ponnam Prabhakar | bus-conductor | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Weather Today: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం: HYD వాతావరణ కేంద్రం

తెలంగాణలో ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

New Update
Weather update

Weather update

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా అకాల వర్షాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు వెను వెంటనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షం కురిసిన వెంటనే ఎండలు మండిపోతున్నాయి. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. 

Also read : తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

అప్పుడే భగభగమండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అప్పటికప్పుడే వాతావరణం చల్లబడిపోయి వర్షం కురిసేస్తుంది. దీంతో ఎండలు ఎప్పుడు ఎక్కుతాయో.. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాబోయే రెండు రోజులు భిన్నవాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. 

Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

రెండు రోజులు జాగ్రత్త

ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. ఇందులో భాగంగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 - 50 కి.మీ, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. 

Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

ఎందుకంటే ఈ 2 డేస్‌ పలు జిల్లాల్లో గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. దానితో పాటు ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నాయని చెప్పుకొచ్చింది. వచ్చే  3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే మరోవైపు ఎండలు కూడా మండిపోనున్నట్లు తెలిపింది. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. 

Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

TG Weather Updates | hyderabad weather today | hyderabad weather report | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు