/rtv/media/media_files/2025/02/17/2ipuruOpJDyxOQPH4bp6.jpg)
Medchal Brothers Incident Case Mother Revealed Facts
తెలంగాణ (Telangana) లోని మేడ్చల్‌లో బస్ డిపో ముందు ఆదివారం దారుణ హత్య (Killed) జరిగింది. ఉమేశ్ అనే వ్యక్తిని సోదరులే నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
ఉమేశ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా రోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. అదే క్రమంలో తన భార్య, తల్లిని కొట్టేవాడు. ఇలా తరచూ ఫ్యామిలీని టార్చర్ చేస్తూ ఉండేవాడు. సోదరులు ఎంత చెప్పినా అన్న ఉమేశ్ వినేవాడు కాదు. దీంతో సోదరులకు ఓపిక నశించింది. అన్నను చంపేస్తామని తమ్ముడు రాకేశ్ ముందుగానే తన తల్లికి చెప్పాడు.
వదినను నేను చూసుకుంటా
తర్వాత ఏది అయితే అది అవుద్దని.. వదినను నేను చూసుకుంటానని రాకేశ్ హామీ ఇచ్చాడు. అనంతరం నిన్ను చంపుతానంటూ రాకేశ్ తన అన్నకు ఫోన్ చేశాడు. ఇక చెప్పినట్లుగానే అన్నను కసితీరా నరికి చంపాడు. ఉమేశ్‌ను వేటాడి, వెంటాడి మరీ నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై అక్కడ నుంచి పరారయ్యాడు.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
ఎలా హత్య చేశారంటే?
నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. అన్నదమ్ములే అతని పాలిట కాలయముడిలా మారారు. ఈ ఘటన మేడ్చల్ నగర శివారులోని బస్ డిపో దగ్గర ఆదివారం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఉమేశ్‌ను కత్తులతో నరికి సోదరులు హత్య చేశారు. ఉమేశ్‌ను కింద పడేసి కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.