KTR: చిట్టినాయుడు శునకానందం పొందుతున్నాడు.. అరెస్టుపై కేటీఆర్ సంచలనం!

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తన మీద పెట్టిన కేసులో ఏమీలేదని, అంతా లొట్టపీసేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాష్ పిటిషన్ కొట్టివేసినందుకే తనకు ఉరిశిక్ష పడబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారని విమర్శించారు. 

New Update
ktr

KTR

KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తన మీద పెట్టిన కేసులో ఏమీలేదని, అంతా లొట్టపీసేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాష్ పిటిషన్ కొట్టివేసినందుకే తనకు ఉరిశిక్ష పడబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో చర్చపెట్టుమంటే సీఎం రేవంత్ పారిపోయారన్నారు. 

శునకానందం.. 

ఈ మేరకు రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్క హక్కును వినియోగించుకుంటా. చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే లాయర్లతో కలిసి విచారణకు వెళ్లాను. ఇందులో అరపైసా అవినీతి జరగలేదు. హైకోర్టు అనుమతిస్తే తప్పకుండా లాయర్లతో కలిసి ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని చెప్పారు. సీఎం రేవంత్ తన ఇంట్లో చర్చ పెట్టిన తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సుప్రీం కోర్టులో న్యాయంగా పోరాటం చేస్తా. కొంతమంది మంత్రులు వాళ్లే న్యాయమూర్తులుగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఈ కేసుపై శునకానందం పొందుతున్నారు. హైకోర్టు విచారణ చేసుకోండి అని చెప్పింది కానీ నేరం చేశానని చెప్పలేదు. మంత్రులకు అంత ఉలికిపాటు ఎందుకు. మీలాగా దివాలాఖోర్ పనులు చేసే అలవాటు మాకు లేదు. అసెంబ్లీలో చర్చ పెట్టుమంటూ పారిపోయారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

ఇది కూడా చదవండి: Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం!

సుప్రీంకోర్టులో పిటిషన్..

ఇక  ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ లీగల్ టీమ్ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో.. అరెస్ట్ నుంచి అయినా రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అందుకు కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. 

ఇది కూడా చదవండి: Dogs: అయ్యో పాపం.. కాళ్లు,నోళ్లు కట్టేసి 32కుక్కలను చంపిన గ్రామస్థులు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment