KTR: ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. రేవంత్ కు ఇదే నా సవాల్!

ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెట్టిస్తున్నారని ఈడీ విచారణ అనంతరం చెప్పారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు. 

New Update
KTR PIC

ktr, supreme court Photograph: (ktr, supreme court)

KTR: ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీక కక్షతోనే తనపై కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు. 

రేవంత్ పై ఏసీబీ, ఈడీ కేసులు..

ఈ మేరకు సీఎం రేవంత్ పై ఏసీబీ, ఈడీ కేసులున్నాయి కాబట్టే తనను ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. తాను పైసా తప్పుగా ఖర్చు చేయలేదని, త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయన్నారు. విచారణకు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసింది. ఆ పది కోట్లు కాంగ్రెస్ ప్రకటించిన పథకాలకు ఖర్చు చేసుకుంటే బాగుంటుంది. రేవంత్ కు నిజాయితి ఉంటే ఏ జడ్జీ ఎదుటనైనా కూర్చుందాం. అక్కడ తేల్చుకుందాం. నేను డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. ఏసీబీ, ఈడీ ఒకేరకమైన ప్రశ్నలు అడిగాయి. ఇదంతా సీఎం కక్ష సాధింపు చర్యలో భాగమే. నేను నిజాయితి పరుడిని ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా. రేవంత్ కు నాకు డిటెక్టర్ టెస్టు పెట్టండి. టైమ్ ప్లేస్ రేవంత్ చెబితే నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. 

ఇది కూడా చదవండి: Shirdi Accident: షిరిడీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

ఇదిలా ఉంటే.. గురువారం కేటీఆర్ ను ఈడీ విచారించింది. ఫార్ములా ఈ-కార్ రేస్ ఇష్యూలో దాదాపు 7 గంటలపాటు కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాలానికి చేరకున్న కేటీఆర్‌ను విచారణ బృందం చాలా ప్రశ్నలు అడిగింది. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్!

ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులోనే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు  నమోదు చేసింది. ఇందులో భాగంగానే గురువారం జరిపిన విచారణలో ప్రధానంగా నగదు బదిలీపైనే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. రూల్స్ పాటించకుండా ఇండియన్ కరెన్సీని పౌండ్లలోకి మార్చి పంపించడం, హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపు, నిధుల బదలాయింపులో ఫేమా నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి సుదీర్ఘంగా కూపీలాగినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు