Khammam: పండగపూట ఖమ్మంలో ఓ సంచలన సంఘటన చోటుచేసుకుంది. సంక్రాతికి ఇంటికొస్తున్న తన అన్నను రిసీవ్ చేసుకునేందుకు బస్టాండ్ వెళ్తు్న్న యువకుడు కిడ్నాపుకు గురికావడం సంచలనం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఖమ్మం కొత్త బస్టాండ్ వెళ్తుండగా మార్గమధ్యలోనే దుండగులు దాడి చేశారు. దీంతో బలవంతంగా తనను ఆటోలో ఎత్తుకెళ్తున్నారంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. కాగా ఈ ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మార్గ మధ్యలోనే కిడ్నాప్..
ఖమ్మం పోలెపల్లి రాజీవ్ గృహ కల్పలో బాధితుడు సంజయ్ కుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. అయితే సంజయ్ అన్న సాయి హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకోసం సోమవారం సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే తాను ఖమ్మం కొత్త బస్టాండ్ లో దిగేవరకు రాత్రి 1:30 అవుతుందని ఆ సమయంలో తనను రిసీవ్ చేసుకోవడానికి రావాలని తమ్ముడు సంజయ్ కి ఫోన్ చేశాడు. దీంతో 1గంటకు ఖమ్మం బయలు దేరిన సంజయ్.. మార్గమధ్యలో తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, అన్నా నన్ను చంపేస్తారంటూ సాయికి వాట్సప్ లో వాయిస్ మెసేజ్ పంపించాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: మీ భార్యల వల్లే ఇలా తయారయ్యారు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్స్
అంతేకాదు ఆటోలో ఉన్న దుండగులు ఒక అమ్మాయిని కూడా చంపేశారని, తనను కాపాడాలంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు. వెంటనే ఈ విషయం తమ కుటుంబ సభ్యులకు సాయి చెప్పడంతో వారంతా ఫోన్ లొకేషన్ ఆధారంగా కాల్వకట్టపైకి చేరుకున్నారు. అక్కడ నిజంగా సంజయ్ బైక్ పడిపోయి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. తమ కొడుకు ఆచూకి తెలియకపోవడంతో సంజయ్ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బిడ్డను రక్షించి ఇంటికి తీసుకురావాలని పోలీసులను వేడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: TG: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. జనవరి 26 నుంచి 4 కొత్త పథకాలు అమలు!