MLC Kavitha Viral Comments: కేసీఆర్ ఐఫోన్... రేవంత్ చైనా ఫోన్.. ఎమ్మెల్సీ కవిత పంచ్ లు!

కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే...రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో...కేసీఆర్ కు, రేవంత్ కు అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు.

New Update
Kavitha Kalvakuntla

Kavitha Kalvakuntla

MLC Kavitha Viral Comments: కేసీఆర్(KCR) పాలన ఐఫోన్ లా ఉంటే... రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలన చైనా ఫోన్ లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో... కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదని చెప్పారు.సోమవారం  జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బూరడి కొట్టించారని ధ్వజమెత్తారు. తప్పుడు జనాభా లెక్కలు చేయడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52 శాతం ఉందని 2014లోనే కేసీఆర్ చేపట్టిన సర్వేలో తేలిందని, కానీ లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమన్నారు. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవపట్టించారని మండిపడ్డారు.

Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు ? అని ప్రశ్నించారు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు  బయటపెట్టడం లేదు ? అని నిలదీశారు. తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని, స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదని కవిత ప్రశ్నించారు. బీసీ ఉద్యమకారులతో, బీసీనాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.

Also Read: పాపం.. డాన్స్ చేస్తుండగానే ఎలా జరిగిందో చూడండి.. యువతి వీడియో వైరల్!

రేవంత్ కు కాలమే గుణపాఠం చెబుతుంది

420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎండిపోయిన పోలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారని, ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని, రైతులకు నీళ్లించే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు రూ. 2500 ఏమయ్యాయని నిలదీశారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుందని, రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నరన్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారని తెలిపారు. 

Also Read: Drugs: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ పెంచి పోషించిన ప్రధాని.. 50 వేల మంది మృతి!

రేషన్ కార్డులు ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. రుణ మాఫీ కూడా సంపూర్ణంగా కాలేదని, రైతులంతా సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని విమర్శిచారు. అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదని, ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని స్పష్టం చేశారు.

Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?

ఉద్యమకారులకు న్యాయం చేస్తా..

అనంతరం జగిత్యాల బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ  కవిత మాట్లాడుతూ... కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ 3.O వస్తది, కేసీఆర్ 3.0 వస్తారని తేల్చిచెప్పారు. "మీ చెల్లెగా అక్కగా చెప్తున్న ఉద్యమకారులందరికీ న్యాయం చేసే బాధ్యత నాది.. నా చేతిలో ఎక్కడ ఎలాంటి అవకాశమున్నా ఉద్యమకారులకే మొదటి ప్రాధాన్యం ఇచ్చిన అని అన్నారు. ఎవ్వరూ దిక్కు లేనప్పుడు గులాబీ జెండా మోసిన ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే" అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంతా సురేశ్ , మాజీ మార్క్ ఫేడ్‌ చైర్మన్ బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: HAJJ 2025: హజ్ యాత్రకు వెళ్లే ఇండియన్స్‌కు బిగ్ షాక్.. మారిన రూల్స్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.

New Update
danam nagender brs

danam nagender brs

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  ఎప్పటినుండో కేసీఆర్‌ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని..   సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు.  హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.  

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

వ్యక్తిగతంగా బాధించింది

అయితే  రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు.  కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.  ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్  తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

Advertisment
Advertisment
Advertisment