/rtv/media/media_files/2026/04/04/latest-news-in-telugu-2026-04-04-15-36-12.jpg)
Dharmapuri Sanjay
Dharmapuri Sanjay : కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో సీనియర్లకు సరైన గుర్తింపులభించడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే జగిత్యాలకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్(nizamabad) మాజీ మేయర్,మాజీ మంత్రి డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ కూడా పార్టీకి ఝలక్ ఇవ్వబోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు పార్టీ నేతలు. పార్టీ పెద్దలు తనను పట్టించుకోక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ధర్మపురి సంజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఆయన ఆర్టీవీతో మాట్లాడుతూ " పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.
"తను పార్టీ మారతానని ఎక్కడ చెప్పలేదు. కాంగ్రెస్ లో సరైన పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న..ఏ పదవి లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి ? ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ నీకేం చేసింది అంటే నా అభిమానులకు ఏం చెప్పాలి? పార్టీలో కో ఆర్డినేషన్ మిస్ అయ్యింది. గతంలో కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ కు చాలా తేడా ఉంది'అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు పదవి రాకుండా కొంత మంది లోకల్ గా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.నా అసంతృప్తిపై పార్టీ నాయకులు ఆరా తీసి నాతో మాట్లాడారన్న ఆయన ఇతర పార్టీల నేతలు సైతం కాల్ చేసి ఆహ్వానిస్తున్నారని స్పష్టం చేశారు. కానీ మా కుటుంబం కాంగ్రెస్ బ్రాండ్ అని చెప్పుకున్న ఆయననాకు పదవి ఇవ్వాలని నా అభిమానులు సంతకాల సేకరణ చేస్తున్నారు. ఇప్పటిదాక 15 వేల మంది సంతకాల సేకరణ జరిగింది. లక్ష మంది సంతకాల సేకరణతో పార్టీకి మెమొరాండం ఇస్తాం అన్నారాయన.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గురించి మాట్లాడుతూ "కాంగ్రెస్ జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఇచ్చిందన్నారు. జీవన్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోవడం అయితే తప్పు అన్నారు. కాంగ్రెస్ లో ఒక సీనియర్ నేతగా మాలాంటి వారితో ఆయన మాట్లాడి కో ఆర్డినేషన్ చేసి ఉంటే బాగుండేదన్నారు. ఉత్తర తెలంగాణ లో మూడు ఎంపీ స్థానాలు కోల్పోయాం. ఇక్కడ పార్టీ బలహీనంగా ఉంది.మాలాంటి బలమైన నేతలను గుర్తించి బాధ్యతలను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని ధర్మపురి సంజయ్ కోరారు.
Also Read : "పోలీస్ మామలు’ అంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో అంతా ఎగ్జిట్..
జిల్లాకేంద్రంలో నిరసన దీక్ష
ఇదిలా ఉండగా నిజామాబాద్ నగర తొలి మేయర్ అయిన ధర్మపురి సంజయ్​కు పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్​ వద్ద వారు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్​కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్​ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ధర్మపురి సంజయ్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయన వెన్నంటే ఉంటామన్నారు.
Also Read : మంత్రి వివేక్‌కు బిగ్ షాక్.. క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం!
Follow Us