Electrical Short Circuit: నేనున్నా.. వైరల్ వీడియో చూసి చలించిన సీఎం రేవంత్.. కీలక ఆదేశాలు!

నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నిపాలైంది. దీంతో రైతులు గుండె పగిలేలా విలపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

New Update
FotoJet - 2026-04-30T133820.725

I am here.. CM Revanth was moved by the viral video.. Key orders!

CM Revanth : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్(electrical short circuit explosion) కారణంగా చేతికొచ్చిన పంటలు కళ్లెదుటే బూడిదవ్వడంతో రైతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిర్మల్ జిల్లా(nirmal-district) పెంబి మండల కేంద్రంలోనూ ఇలాంటి ఘోరకలే చోటుచేసుకుంది. కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా షార్ట్ సర్క్యూట్ సంభవించి గోసుకుల రాములు, కన్నె మల్లేష్‌లకు చెందిన సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట(Corn crop) అగ్నిపాలైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేసినప్పటికీ, అప్పటికే పంట అంతా బూడిదైపోయింది. బిడ్డల్లా సాకిన పంట కళ్లెదుటే కాలిపోతుంటే ఆ రైతులు గుండె పగిలేలా విలపిస్తున్న దృశ్యాలు చూపరులను కలచివేస్తున్నాయి.

Also Read :  కవితకు TRS.. అదిరిపోయే శుభవార్త చెప్పిన EC!

Electrical Short Circuit

అలాగే వడ్డేపల్లి మండలంలోని జక్కిరెడ్డిపల్లెలో ఉప్పరి వెంకటేష్ అనే రైతు(formers) నాలుగు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట బుధవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట కోతకు ముందే అగ్నికి ఆహుతి కావడంతో, పెట్టుబడి కూడా దక్కని ఆ రైతు కన్నీరుమున్నీరవుతూ ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

నిర్మల్ జిల్లాలో కేవలం మొక్కజొన్న మాత్రమే కాకుండా వరి, జొన్న పంటలు కూడా ఇదే తరహా విద్యుత్ ప్రమాదాలకు గురై భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు బుగ్గిపాలు కావడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని రైతులు వాపోతున్నారు. ఆశలన్నీ అగ్నిపాలై కన్నీటిలో మునిగిన ఈ పేద రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఈ విషాద ఘటనలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో రైతులు ఎదుర్కొన్న నష్టంపై సమాచారం అందిన వెంటనే ఆయన అధికారులతో సమీక్షించారు. నష్టపోయిన రైతుల వివరాలను తక్షణమే సేకరించి, వారికి తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని సీఎంఓ అధికారులను, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టారు. 

Also Read :  ప్రభుత్వ పరమైన హైదరాబాద్ మెట్రో... పూర్తిగా తప్పుకున్న ఎల్‌అండ్‌టీ

Advertisment
తాజా కథనాలు