HYDRA : హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న 3 రోజులు అధికారుల సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో CM వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజా వర్మ, శ్రేయా వర్మ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఖజానా జ్యువెలర్స్‌లో తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. అలాగే స్టోర్ డిప్యూటీ మేనేజర్‌పై కూడా కాల్పులు జరిపారు.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో అవినాష్ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని చందానగర్ లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లర్స్ షాపులోకి చొరబడిన ఆరుగురు దుండగులు గన్‌తో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ కావాలని సూచించారు.
తెలంగాణ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే రాజాసింగ్ మరొక్కసారి సంచలన ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో చేరేవారు ఒక్కసారి ఆలోచించి పార్టీలో చేరాలంటూ ఆయన సూచించారు. పార్టీలోకి వచ్చాక కార్యకర్తలకు మీరేం పదవులు ఇప్పించుకోలేరంటూ తేల్చి చెప్పారు.