HYD: పథకం ప్రకారమే జర్మన్ యువతిపై అత్యాచారం..దర్యాప్తు కీలక విషయాలు

పెను దుమారం రేపిన హైదరాబాద్ లో జర్మన్ యువతి అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మ్మద్ అబ్దుల్ అస్లాం పక్కా పథకం ప్రకారమే ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డాడని దర్యాప్తులో తెలిసింది. ఫ్మామిలీ మ్యాన్ లా నటిస్తూ యువతిని నమ్మించాడు.

New Update
hyd

german woman rape case

జర్మన్ యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు మహ్మద్‌ అబ్దుల్‌ అస్లాం నేర చరిత్ర ఉన్నవాడు. ఇతని వయసు కేవలం 25 ఏళ్ళు. ఓ పార్టీ నేత కుమారుడైన అస్లాం 19 ఏళ్ళ వయసులో ఓ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో కేసును 2022లో న్యాయస్థానం కొట్టేసినట్లు పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేశాడు. ఏడాది క్రితం హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి జులాయిగా తిరుగుతున్నాడు. 

పక్కా పథకం ప్రకారం..

మార్చి 31న రంజాన్ రోజు కార్ తీసుకుని తన కాలనీకే చెందిన మిగతా యువకులతో కలిపి రోజంతా తిరిగాడు అస్లాం. మందమల్లమ్మ చౌరస్తా దగ్గర జర్మన్ యువతి, ఆమె స్నేహితుడు కనిపించారు. అస్లాం..ఫ్యామిలీ మ్యాచ్ లా పటిస్తూ వారితో పరిచయం చేసుకున్నాడు. వారికి మాయ మాటలు చెప్పి కారు ఎక్కించుకున్నాడు. మామిడిపల్లి గ్రామం సమీపానికి వెళ్లాక మైనర్లను, యువతి స్నేహితుడిని కారు నుంచి దింపి సెల్ఫీలు తీసుకోవాలని అస్లాం సూచించాడు. దగ్గరలో యూటర్న ఉందని తిప్పుకొస్తామని చెప్పి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

కోర్టులో బాధితురాలి వాంగ్మూలం..

అస్లాంను పహాడీ షరీఫ్ పోలీసులు ఎల్బీనగర్ లోని రంగారెడ్డి కోర్టులో హాజరుపర్చారు.  న్యాయస్థానం ఈ నెల 16 వరకు అతడికి రిమాండ్ విధించింది. నిందితుడి కస్టడీ కోసం పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బాధితురాలిని రాచకొండ పోలీసులు మంగళవారమే జడ్జి దగ్గరకు తీసుకువెళ్లి వాంగ్మూలం రికార్డు చేయించారు. ఆమె స్నేహితుడి వాంగ్మూలం కూడా ఇప్పించారు. ఈ కేసులో అతను కూడా ఒక సాక్షిగా ఉన్నాడు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అవసరమైతే వర్చువల్‌ హాజరుతో బాధితురాలితో మాట్లాడిస్తారని అధికారులు తెలిపారు.

today-latest-news-in-telugu | hyderabad | rape-case | German woman | crime

Also Read: Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Advertisment
Advertisment
Advertisment