/rtv/media/media_files/2025/03/04/ZRZp14LjsLOvnSHE3ZeX.jpeg)
hyderabad crime
Hyderabad : ఆరునెలల క్రితం గోవా (Goa) లో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి, ఓ మంచి అపార్ట్మెంట్ లో కాపురం, భార్య భర్తలిద్దరికీ ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. అబ్బా.. ఎంత హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు కదా? కానీ ఇంతలోనే కథ ఊహించని మలుపు తిరిగింది. పెళ్ళైన ఆరునెలలకే అమ్మాయి ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయింది (Suicide). ఈ విషాదకర ఘటన హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లోని అపార్ట్మెంట్ లో చోటుచేసుకుంది.
Also Read : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్లైఓవర్ కింద ఎగసిపడుతున్న మంటలు!
ఆరునెలల క్రితం ప్రేమ పెళ్లి
వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన కమలాపురం దేవిక, మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీశ్ చంద్ర ఒకే సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు (Software Employees) గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరువైపు కుటుంబాలను ఒప్పించి గతేడాది ఆగస్టు 23న గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
Also Read : సర్పంచ్ హత్య.. మంత్రి రాజీనామా!
ఇంతలోనే గొడవలు..
ఆ తర్వాత రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో కాపురం పెట్టారు. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే భార్య భర్తలిద్దరి మధ్య మస్పర్థలు, గొడవలు మొదలయ్యాయి. ఇలా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దేవిక, సతీష్ ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఆ తర్వాత సతీష్ కూడా బయటకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తర్వాత తిరిగి వచ్చాడు.
Also Read : బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన
అర్థరాత్రి ఫ్యాన్ కి ఉరేసుకొని
ఇంటికొచ్చిన సతీష్ దేవిక గది తలుపులను పెట్టి ఉంచడంతో .. నిద్రపోయిందనుకొని సతీష్ మరో గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ తర్వాత తెల్లవారుజామున మరోసారి భార్య తలుపు తట్టాడు. అప్పటికి కూడా దేవిక స్పందించలేదు. పని మనిషి వచ్చాక తలుపు కొట్టినా తీయలేదు. ఆ తర్వాత 10 గంటలకు ఆఫీస్ కి వెళ్లాల్సి ఉండగా, అప్పటికీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్ తలుపు బద్దలు కొట్టి చూడగా.. దేవిక ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించింది. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త సతీష్ కట్న వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని దేవిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Ramayana: షాకింగ్ న్యూస్.. 'రామాయణ' నుంచి ఆ స్టార్ నటి అవుట్.. కారణం ఇదేనా!