HYD: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే..

నిన్న హైదరాబాద్ ప్రిజం పబ్ దగ్గరలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. 2022 నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update

గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో నిన్న రాత్రి దొంగను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలోనే అతడు పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తొడభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అలాగే కానిస్టేబుల్‌తో పాటు పబ్‌లో ఉన్న ఒక బౌన్సర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 

పోలీసుల అదుపులో దొంగ 

అయితే దొంగ కాల్పులు జరిపినప్పటికీ పోలీసులు సాహసం చేసి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ కాల్పుల ఘటన గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌‌లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక దొంగను పట్టుకున్న పోలీసులు.. ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌గా చెబుతున్నారు. 

Also Read: USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్

2022 లో పారిపోయాడు...

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న బత్తుల ప్రభాకర్ గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. నిందితుడు అసలు పేరు రాహుల్ రెడ్డి. వయసు 29 ఏళ్ళు. ఇతను పాత నేరస్థుడే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రభాకర్ పైన 80 వరకూ దొంగతనాల కేసులు ఉన్నాయి.  రీసెంట్ గా సైబరాబాద్ పరిధిలో కూడా దొంగతనం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ప్రభాకర్ ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేస్తుంటాడు.  2022 మార్చిలో విచారణ కోసం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి  తప్పించుకుపోయాడు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచీ పోలీసులు ఇతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్న పక్కా సమాచారంతో ప్రిజం పబ్ దగ్గర నిందితుడు ఉన్నాడని తెలుసుకుని పోలీసులు పట్టుకునేందుకు వెళ్ళారు. 

Also Read: Pak: బలూచిస్తాన్ లో మారణ హోమం..41 మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

పాకిస్తానీ యువకుడిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గతంలో HYDకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్న మహమ్మద్ ఫయాజ్.. ఆమెను కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. అతడిని గుర్తించిన పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

New Update
HYD PAHALGAM

HYD PAHALGAM Photograph: (HYD PAHALGAM)

పహల్గాం ఉగ్రవాద దాడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో భారత్ - పాక్ మధ్య కొన్ని దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.   

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

హైదరాబాద్‌లో పాక్ యువకుడు

దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ మేరకు తాజాగా హైదరాబాద్ పోలీసులు ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. 

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

తెలంగాణ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థానీలను వెంటనే వెనక్కి పంపాలన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే భారత్ ను వీడాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీతో  వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు.   

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామన్న డీజీపీ..  అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా హైదరాబాద్ లో 208మంది పాకిస్థానీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రం పాకిస్తానీల వీసాలు రద్దు చేసింది. 

Also Read :  బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా

పాకిస్తానీయులపై పోలీసులు నజర్

హైదరాబాద్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై పోలీసులు నజర్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలు సేకరించారు. 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్‌లో ఉన్నటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి మరో రెండు రోజుల్లోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కేంద్ర ఇచ్చిన గడువు ముగుస్తోండటంతో అన్నిరాష్ట్రాలను కేంద్రహోంశాఖ అలెర్ట్ చేసింది. అదే విధంగా పాక్, ఇండియా ఉద్రిక్త పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో సెక్యురీటీ హై అలర్ట్ చేశారు. 

latest-telugu-news | Pahalgam attack | Pahalgam Attack latest news

Advertisment
Advertisment
Advertisment