/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
ACCIDENT
ఎల్బీనగర్ లో ఓ కారు ఇవాళ అందరినీ బాగా భయపెట్టింది. మందుతాగి వాహనాలు నడపొద్దని ఎంత చెబుతన్నా ఎవరూ వినడంలేదు. పీకల దాకా తాగడం, ఒళ్ళు తెలియకుండా వాహనాలను డ్రైవ్ చేయడం. దానివలన యాక్సిడెంట్లు...ఇదో నిత్యకృత్యంగా మారింది. ఈరోజు మన్సూరాబాద్ లొ కూడా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఫుల్ గా మందుకొట్టి కారును డ్రైవ్ చేయడం వలన ఓ యుకుడు ప్రణాలు పోయే పరిస్థితి వచ్చింది. తన కారుతో బైక్ నడుపుతున్న దివాన్స్ అనే కుర్రాడిని ఢీకొట్టాడు ప్రభాకర్ రెడ్డి. అక్కడితో ఆగకుండా.. బైక్ ను నెట్టుకుంటూ కిలోమీటర్ నడిపించాడు కూడా. దీంతో బైక్ మీద ఉన్న యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
సీసీ కెమెరాలో దృశ్యాలు..
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు, బైక్ ధ్వంసం అయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన ప్రభాకర్ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మొత్తం సంఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్న వారిపై స్థానికులు మండిపడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
Also read: Manipur riots: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్, జోమి తెగల మధ్య గొడవలు