ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని జీఎచ్‌ఎంసీని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. రోడ్డు విస్తరణలో భాగంగా తన భూమిలో ఒకవైపు 20, మరోవైపు 30 అడుగులు సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లు అభివృద్ధి చేయాలని కొన్ని రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!
అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇంటి స్థలం సేకరణ విషయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని జీఎచ్‌ఎంసీని కోరారు.
— RTV (@RTVnewsnetwork) February 10, 2025
Read More>>https://t.co/XMXrNMGz2t#ChandraSekharReddy #Hyderabad #Telangana #RTV
ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!
కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఆరు జంక్షన్లు..
కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.826 కోట్లతో మొత్తం ఆరు జంక్షన్లను నిర్మించనున్నారు. పార్క్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్, ఫిలింనగర్, రోడ్ 45, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం ఆసుపత్రి వైపు ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాసులు కూడా నిర్మించనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి కావాల్సిన పరిపాలనా అనుమతులను కూడా ప్రభుత్వం జారీ చేసింది.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!