/rtv/media/media_files/2025/02/11/RkZGe27EMxPyeD9dKwWF.webp)
Greater Hyderabad Municipal Corporation
Greater Hyderabad Municipal Corporation : గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెండు మహానగర కార్పొరేషన్లు చేయాలని తెలంగాణ సర్కారు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, కొన్ని గ్రామాలను బల్దియాలో కలిపి మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత భావించిం ది. నగరాన్ని సమ్మిళిత అభివృద్ధి దిశగా నడిపించేందుకు విలీనం ద్వారానే సాధ్యమని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అయితే ఒకే కార్పొరేషన్ చేస్తే సాంకేతికంగా ఇబ్బంది ఎదురవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. రెండు కార్పొరేషన్ల ఏర్పాటు వైపు ఆయన మొగ్గు చూపినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ రెండుగా చీలిపోనున్నది. జీహెచ్ ఎంసీ రెండు కార్పొరేషన్లుగా విడిపోనున్నది.
ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!
ముంబయి తరహా విభజన
ముంబయి నగరం మొత్తం రెండు కార్పొరేషన్లుగా ఉండటం వల్లే అభివృద్ధి సాధ్యమైందన్న భావన ప్రభుత్వానికి ఉంది. హైదరాబాద్‌లోనూ ఆస్థాయి అభివృద్ధి జరగాలంటే రెండు కార్పొరేషన్లు ఉండాలని, దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీని మినహాయిస్తే ఓఆర్‌ఆర్ లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్ కార్పొరేషన్‌తో పోలిస్తే అభివృద్ధి విషయంలో వీటి మధ్య వ్యత్యాసం ఉంది. ఈక్రమంలో ఓఆర్‌ఆర్ వరకూ నగరాన్ని ఒకేవిధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు జీహెచ్‌ఎంసీ 2 వేల చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరిస్తుంది. దీంతో ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధిని పెంచాలని సర్కార్ బావిస్తోంది. తద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GSMC) గా హైదరాబాద్ ను విభజించాలని నిర్ణయించారు.
ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!
30 సర్కిళ్లు, ఆరు జోన్లుగా జీహెచ్ఎంసీ
రాజధానికి ఔటర్ రింగు రోడ్డు హద్దుగా చేసుకొని దాని లోపలున్న 2,100 చ.కి.మీ భూభాగాన్ని రెండు కార్పొరేషన్లుగా విభజిస్తారు. ప్రస్తుతం జీహెచ్ ఎంసీని 150 డివిజన్లుగా విభజించారు. GHMC,GSMCగా హైదరాబాద్ విభజన తర్వాత రాబోయే గ్రేటర్ నగరాల కోసం.. డివిజన్ల నుంచి పునర్విభజన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. కాగా జీహెచ్ఎంసీ విభజనపై గత ప్రభుత్వానికి ప్రసాదరావు కమిటీ నివేదిక ఇచ్చింది. GHMC ని 50 సర్కిళ్లు, 10 జోన్లుగా విభజించాలని నివేదిక అందించింది.కానీ విభజన విషయంలో నాటి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రస్తుతం 30 సర్కిళ్లు, ఆరు జోన్లుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!
మొదట విలీనం..తర్వాత విభజన
ఓఆర్ఆర్ లోపలి జీహెచ్‌ఎంసీతోపాటు 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటితో పాటు కంటోన్మెంట్ బోర్డు, ఇతర సంస్థలు ఉన్నాయి. ఓఆర్‌ఆర్, వెలుపల ఉన్న మరో 10 పంచాయతీలనూ జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముందుగా ఇప్పటికే గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగియడంతో వాటిని సమీపంలోని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేస్తారు. వచ్చే ఏడాది జనవరితో వీటి కాలపరిమితి ముగియనుండగా.. వాటిని జీహెచ్‌ఎంసీలో కలుపుతారు. విలీనానికి వీల్లేని గ్రామాలను ప్రత్యేక మున్సిపాలిటీలుగా గుర్తిస్తారు. చివరకు. జీహెచ్‌ఎంసీని రెండుగా విభజించి గ్రేటర్ కార్పొరేషన్లను ప్రభుత్వం ప్రకటిస్తుంది.
ఇది కూడా చూడండి: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..
Also Read: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..