/rtv/media/media_files/2025/03/26/PSMq8RjkFYxv43rYZINT.jpg)
MMTS young woman attempted rape case Big twist accused is not Mahesh
రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని MMTS రైలులో ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆ యువతి రన్నింగ్ ట్రైన్‌లో నుంచి కిందకి దూకేసింది. ప్రస్తుతం ఆ యువతికి యశోద హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
ఇందులో భాగంగానే పోలీసులు పాత నేరస్తుల ఫొటోలను బాధితురాలికి చూపిస్తున్నారు. అందులో ఒక పాత నేరస్తుడి ఫొటో.. నిందితుడికి దగ్గర పోలికలు ఉన్నట్లు ఆ బాధిత యువతి చెప్పడంతో తాజాగా ఆ అనుమానితుడి జాడను పోలీసులు కనుగొన్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించారు.
Also Read : ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!
అతడు.. ఇతడు కాదు
అతడిని తీసుకొచ్చి బాధిత యువతి ముందు ఉంచారు. తీరా అతడిని చూశాక ఆ యువతి పోలీసులకు షాక్ ఇచ్చింది. నిందితుడు అతడు కాదని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. అయితే పోలీసులు మహేశ్‌తో పాటు మరికొందరు నిందుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తమదైన శైలిలో విచారిస్తున్నారు.
Also Read : రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి
అన్ని స్టేషన్‌లో పలు కోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడు అల్వాల్ రైల్వేస్టేషన్ నుంచి MMTS ట్రైన్ ఎక్కినట్లు నిర్ధారించుకున్నారు. కానీ అతడు ఎక్కడ దిగిపోయాడు అనేది మాత్రం స్పష్టత లేదు. దీంతో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Also Read : ఫార్మ్-డీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. రాజమండ్రిలో హై టెన్షన్
(crime news | latest-telugu-news | telugu-news | Hyderabad MMTS Incident | Hyderabad MMTS train | MMTS Train women Case | today-news-in-telugu | telugu crime news | telangana crime case | telangana crime incident | telangana crime news | telangana-crime-updates)