Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దుమారం లేపుతోంది. వరుసగా సెలబ్రిటీలపైన కేసులు నమోదవుతున్నాయి. వారిలో తెలుగు హీరోయిన్ అనన్య నాగల్ల పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలపై అనన్య స్పందించింది. "బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని మాకు ఇప్పుడే తెలిసింది. బాలీవుడ్‌లో పెద్ద స్టార్లు, క్రికెటర్లు కూడా ఇలాంటివి ప్రచారం చేశారు కదా, వాళ్ళు అన్నీ తెలుసుకునే చేస్తారని అనుకున్నాం. హైదరాబాద్ మెట్రో లో కూడా ఇలాంటి ప్రకటనలు కనిపిస్తే, అవి చట్టవిరుద్ధమని మాకు ఎలా తెలుస్తుంది?" అని ఆమె ప్రశ్నించారు.
Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!
ఈ సందర్భంగా మాట్లాడుతూ..."అవగాహన లేక, తెలిసి తెలియక తానూ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసానని, తరువాత తప్పు తెలుసుకొని తన వల్ల నష్టపోయిన వారందరికి తాను డబ్బులు తిరిగి ఇచ్చినట్లు" వెల్లడించింది. "ఒక వీడియో స్టోరీ పోస్ట్ చేసినందుకు నాకు రూ. 1.20 లక్షలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఈ యాప్స్ వల్ల నష్టం జరుగుతుందని తెలుసుకున్నాక, నాకు తప్పేంటో స్పష్టంగా అర్ధమయ్యింది. ఇకపై నేను ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయను" అని స్పష్టం చేసింది. అంతేకాక తనకు తెలియకుండా చేసిన యాడ్ వల్ల నష్టపోయిన వారికి డబ్బలు కూడా తిరిగి ఇచ్చినట్లు వెల్లడించింది.కాగా పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు అనన్యతో సహా పలువురు సినీ తారలు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు.
Also Read: రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!
మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫణీంద్ర శర్మ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత డబ్బు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అనన్యతో పాటు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వివాదంపై అనన్య స్పందిస్తూ.. తెలియకుండా ఈ ప్రమోషన్స్ చేశానని, ఇతర పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలాంటివి చేశారని చెప్పారు. అయితే, ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదం అవడంతో ఆనన్య ఆ తరువాత సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరింది.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
Betting Apps : బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే తప్పని ఎలా తెలుస్తుంది ? అనన్య నాగల్ల సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దుమారం లేపుతోంది. వరుసగా సెలబ్రిటీలపైన కేసులు నమోదవుతున్నాయి. వారిలో తెలుగు హీరోయిన్ అనన్య నాగల్ల పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. ఈ క్రమంలో అవి చట్టవిరుద్ధమని మాకెలా తెలుస్తుంది?" అని ఆమె ప్రశ్నించారు.
Ananya Nagalla