Telangana: తెలంగాణ వాసులకు బిగ్ అలెర్ట్.. 5 రోజులు మండే ఎండలు...!

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. ఇంకో ఐదు రోజుల పాటు ఎండలు, వేడి గాలులతో ఇబ్బంది పడాల్సిందేనని.. ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

New Update
Weather Alert : వేసవి కాలం.. వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం..

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా.. వచ్చే పది రోజుల్లో తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడబోతున్నట్టు తెలంగాణ వాతావరణ నిపుణలు చెప్తున్నారు.

Also Read: Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

ఈ నేఫథ్యంలోనే.. తెలంగాణ వాతావరణశాఖ అధికారులు  కీలక అప్డేట్ అందించారు. మార్చి 19 వరకు వేడిగాలుల బాధలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే.. మార్చి 20 నుంచి 24 తేదీల్లో మాత్రం రాష్ట్రంలో అకాల వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా బలమైన ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయితే.. ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుందని కూడా పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం వేడికి బాధపడాల్సిందేనని.. మార్చి 20 తర్వాత మాత్రం రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

అయితే.. ఈ వార్త మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజలకు కాస్త ఉపశమనం కలింగించేదే అయినా.. ఉరుములు, మెరుపులతో కురిసే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో.. ఆ రోజుల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు.

మరోవైపు.. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఉష్ణోగ్రతలపై కీలక అప్డేట్ ఇచ్చారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా.. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం కూడా గట్టిగానే ఉంటుదని అధికారులు చెప్తున్నారు. అయితే.. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు సమాచారం.

ఇక.. శనివారం (మార్చి 15న) గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్న అధికారులు.. ఇంకో 7 జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ జారీ చేయనున్నట్టు తెలిపారు. అయితే.. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

Also Read: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment