High Court: ఐబొమ్మ రవికి బిగ్‌ రిలీఫ్‌.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

New Update
Ibomma Ravi

Ibomma Ravi

సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవి(iBomma Ravi) కి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు(high-court) అతడికి షరతులతో కూడిన బెయిల మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లిపోవద్దని చెప్పింది. అలాగే అతడి పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. సినిమా పైరసీ విషయంలో గతేడాది నవంబర్ 16న రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: రెండు కోట్ల బీమా కోసం దారుణం.. స్నేహితుడి చంపేందుకు కుట్ర

Conditional Bail To Ibomma Ravi

గత మూడు నెలల నుంచి ఐబొమ్మ రవి జైల్లోనే ఉంటున్నారు. పలుమార్లు బెయిల్‌ పిటిషన్ వేసినప్పటికీ కోర్టు కొట్టివేసింది. చివరికి తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రవికి ఇంటర్నెట్ సౌకర్యం కూడా సొంతంగా ఉండకూడదని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అత్యవరస పరిస్థితుల్లో వాడాల్సిన పరిస్థితి వస్తే పోలీసుల ముందస్తు అనుమతితో వాడాలని సూచించింది. 

Also Read: సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఆ బాధ పోయినట్లే!

Advertisment
తాజా కథనాలు