/rtv/media/media_files/2025/01/22/lcMGUeRafB5jlJueeCwh.jpg)
high court TG Photograph: (high court TG)
బీఆర్ఎస్ పార్టీ నిర్వహించాలనుకున్న రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండలో రైతు దీక్ష పేరుతో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి ఆ ధర్నాకు పర్మిషన్ రాలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
బ్రేకింగ్ న్యూస్: నల్గొండలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి
— RTV (@RTVnewsnetwork) January 22, 2025
ఈ నెల 28న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతినిచ్చిన హైకోర్టు @BRSparty @KTRBRS #Nalgonda #Telangana #RTV pic.twitter.com/D8enGrU1Dl
జనవరి 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్ భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.