/rtv/media/media_files/2026/05/03/heavy-rains-2026-05-03-20-51-15.jpg)
Heavy rains
తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీలోని తిరుపతిలో జల్లులు కురవగా కోనసీమ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇక తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. హుజూర్‌నగర్‌లో బలమైన గాలుల ప్రభావానికి చెట్లు నెలకొరిగాయి.
Also Read: షాకింగ్ ఘటన.. రోడ్డు పక్కన చిరుతిండి తిని 58 మందికి అస్వస్థత
ఇప్పటిదాకా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ అకాల వర్షాల వల్ల అన్నదాతలకు మాత్రం తీరని ఆవేదన మిగులుతోంది. ముఖ్యంగా సిద్ధిపేట లాంటి ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు కోసం నిల్వ ఉంచిన ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయింది. కోత దశలో ఉన్న పంటలు, అలాగే ఆరబోసిన ధాన్యం తడిసిపోవడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎండల నుంచి సామాన్యులకు ఉపశమనం లభించినప్పటికీ.. అకాల వర్షం వల్ల రైతులకు భారీ దెబ్బ పడింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన వాళ్లని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Follow Us