/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
Rain
Heavy rain : హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండలతో ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రం వచ్చేసరిగా మేఘావృతం అయింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని మాదాపూర్, బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, బాచుపల్లి,కూకట్ పల్లి, మియాపూర్,అమీర్‌పేట, బోరబండ, దుండిగల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
కాగా అందరూ ఆఫీసులు నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. మరోవైపు రోడ్లమీదకు వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సికంద్రాబాద్ తదితర మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లతే తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇక పలు చోట్ల కురుస్తున్న వర్షాలతో పలువురు ఇబ్బందులకు గురయ్యారు
Follow Us