Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

HCU భూముల విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఉపయోగించుకుని కుట్రలు చేస్తుందని, HCU భూములు ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అభివృద్ధిని అడ్డుకుని రాష్ట్రసంక్షేమానికి బీఆర్ఎస్ విరోధకంగా మారిందన్నారు.

New Update
D. Sridhar Babu Minister of IT of Telangana

D. Sridhar Babu Minister of IT of Telangana

Sridhar Babu : HCU భూముల విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఉపయోగించుకుని కుట్రలు చేస్తుందని, HCU భూములు ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డివేంచేర్ ట్రస్టీ HCU భూములు ప్రభుత్వానియేనని క్లీయర్ గా చెప్పిందన్నారు.అభివృద్ధిని అడ్డుకుని  రాష్ట్ర సంక్షేమానికి బీఆర్ఎస్ విరోధకంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధ్యతాయుతంగా పని చేయాలని మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు. తొమ్మిది ఏండ్ల క్రితం రాజస్థాన్ లో చనిపోయిన జింక పిల్లను HCU లో చనిపోయినట్లు చూపించారు. ఏనుగులు HCU పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు AI ద్వారా చూపించారు.సోషల్ మీడియాను ఉపయోగించుకొని మా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు.

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

రాష్ట్రంలో అభివృద్ధి జరగొద్దని అడ్డుకుంటున్నారన్నారు.రూ. 5200 కోట్ల భూమిని 30వేల కోట్లకు చూపించారని కేటీఆర్ అంటుండు. CBI (సెక్యూరిటీ బ్యూరో ఆప్ ఇండియా) అనే రియలేస్టేట్ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం 23వేల కోట్ల వాల్యూ వచ్చింది. దాన్ని SEBI,RBI నిర్దారణ చేసిందన్నారు.ICICI బ్యాంక్ లోన్ ఇవ్వలేదన్నారు.HCU భూమి పై సుప్రీం కోర్టు లో ఏవిధమైన వాద్యాలు లేవని మంత్రి అన్నారు.TGIIC మార్కెట్ ఫోర్ సెస్ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థల నుండి ముచువల్ పెట్టుబడులు బాండ్ల ద్వారా ప్రభుత్వం సేకరించిందన్నారు.తక్కువ ఇంట్రెస్ట్ తో ప్రభుత్వ సంక్షేమం కోసం నిధులు సేకరించామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 5th డిసెంబర్ 2024 లో 9,వేల 995 కోట్ల బాండ్ల ద్వారా ప్రభుత్వం నిధులను సేకరించిందన్నారు.9.35 ఇంట్రెస్ట్ తో నిధులు సేకరణ జరిగిందన్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

SEBI లో రిజిస్టర్ అయిన మర్చంట్ బ్యాంకర్ ను TGIIC నియమించుకుంది. ట్రస్ట్ ఇన్వెస్ట్ ఇండస్ట్రీ సంస్థ ఇతర రాష్ట్రాలకు నిధులు సమకూర్చిందని వాటిని రైతుల సంక్షేమం,రైతు భరోసా, రైతు ఋణమాపి ఉపయోగించామని శ్రీధర్ బాబు వివరించారు. REC, PFC BOB నుండి 10.09% కు BRS ప్రభుత్వం అప్పు తీసుకుంది.BRS కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఇంట్రెస్ట్ కు అప్పు తీసుకుందని వివరించారు.TGIIC ద్వారా 8,476,కోట్లు రూపాయలు ప్రభుత్వం తీసుకుందని, వాటిలో ఋణమాపీ కి 2వేల146 కోట్లు, రైతు భరోసా కు 5వేల 463 కోట్లు ఉపయోగించుకుందన్నారు. సన్నబియ్యం కోసం రూ. 947 కోట్లు రూపాయలు ప్రభుత్వం ఉపయోగించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దురదృష్టి తో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో BRS నేతలు ఎందుకు విషం కక్కుతున్నారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: బీపీ చెక్‌ చేసుకునేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Smita Sabharwal : HCU భూముల వ్యవహారం.. స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్‌ సర్కార్ బిగ్‌ షాక్‌

స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేశారు.

New Update
snmitha ias

snmitha ias

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు.  సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేయడమే ఇందుకు కారణం. 2025 మార్చి 31వ తేదీన  ‘Hi Hyderabad’ అని ఎక్స్ వేదికగా షేర్ చేయబడింది. ఇది మష్రూమ్ రాక్ వద్ద బుల్‌డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లి స్టైల్‌లో రూపొందించబడినదిగా ఉంది. 

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో ఫేక్ ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్స్ వేదికగా  స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టుకు గానూ పోలీసులు నోటీసులు అందించారు. 

Also read:   ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఇదేం పనిరా.. మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు